వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినారె అంతిమయాత్ర: అందరిలో ఒకడై... అన్నింటా తానై, విలక్షణత చాటుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ఉద్యమ దిక్సూచి ఆచార్య జయశంకర్‌ సార్ మరణించినప్పుడు దగ్గరుండి అంతిమయాత్రను పర్యవేక్షించిన సీఎం కేసీఆర్.. బుధవారం సాహితీ దిగ్గజం సినారె అంతిమ వీడ్కోలు కార్యక్రమంలోనూ ఇంటి పెద్ద తరహా పాత్ర పోషించ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ గడ్డమీద పుట్టి, అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అరమరికలు లేకుండా, అన్నీ తానై వ్యవహరించారు.

గతంలో తెలంగాణ ఉద్యమ దిక్సూచి ఆచార్య జయశంకర్‌ సార్ మరణించినప్పుడు దగ్గరుండి అంత్యక్రియలు పర్యవేక్షించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు సాహితీ దిగ్గజానికి అంతిమ వీడ్కోలు కార్యక్రమంలోనూ ఇంటి పెద్ద తరహా పాత్ర పోషించి తన విలక్షణతను చాటుకున్నారు.

కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని...

కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని...

తన కార్యక్రమాలన్నింటినీ రద్దుచేసుకున్న సీఎం.. బుధవారం ఉదయం ఆరు గంటలనుంచే సీఎంవో అధికారులను, సాహిత్య అకాడమీ చైర్మన్ సిధారెడ్డి, మామిడి హరికృష్ణ, దేశపతి శ్రీనివాస్‌ను పరుగులు పెట్టించారు. అంతియయాత్ర విషయంలో సీఎం చూపిన శ్రద్ధకు తెలంగాణ సారస్వత పరిషత్తు తరపున ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య ధన్యవాదాలు తెలిపారు.

ముందే వచ్చిన ముఖ్యమంత్రి..

ముందే వచ్చిన ముఖ్యమంత్రి..

సినారె భౌతికకాయం మహాప్రస్థానం స్మశాన వాటికకు చేరుకోవడానికి ముందే సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు. సినారె భౌతిక కాయం ఉన్న వాహనానికి ఆయన ఎదురొచ్చి అందరిలో ఒకడిగా అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సినారె అంత్యక్రియలకు హాజరయ్యే అభిమానులు, కవులు, పండితులు, కుటుంబసభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పది నిమిషాలకోసారి ఆరా...

పది నిమిషాలకోసారి ఆరా...

సినారె భౌతికకాయం పరిషత్తుకు తీసుకువచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులపై ప్రతి పది నిమిషాలకు ఒకసారి సీఎంవో అదనపు కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిరిసిల్ల, కరీంనగర్‌లతో పాటు ఆదిలాబాద్ వంటి దూర ప్రాంతాల నుంచి కవులు కళాకారులు, సినారె అభిమానులు వచ్చారా? బస్సులు సరిపోయాయా? అంటూ ఆరా తీశారు.

అందరికీ బాధ్యతలు పంచి...

అందరికీ బాధ్యతలు పంచి...

తన గడ్డపై పుట్టిన కవులను తెలంగాణ ఎంతో గొప్పగా గౌరవించుకుంటుందని చెప్పడమే తన ధర్మమని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించారు. అంతిమయాత్ర సమయంలోనూ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డితో మాట్లాడి ట్రాఫిక్ నియంత్రణలను పర్యవేక్షించాల్సిందిగా సూచనలు చేశారు. మంత్రి మహేందర్‌రెడ్డితో మాట్లాడి బస్సులలో వస్తున్న వారికి చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. హనుమాజీపేట, సిరిసిల్ల నుంచి వచ్చినవారితో మాట్లాడారు. అంతిమయాత్ర బాధ్యతలను మేయర్ బొంతు రామ్మోహన్‌కు అప్పగించారు.

ఇంటి పెద్దగా మారిన సీఎం...

ఇంటి పెద్దగా మారిన సీఎం...

సినారె భౌతికకాయంపైన చల్లే పూలు మొదలుకొని.. మహాభినిష్క్రమణ పేటిక అమర్చాల్సిన పద్ధతి.. దింపుడుకల్లం, ఇలా ప్రతి చిన్న విషయంలోనూ సీఎం కేసీఆర్ ఇంటి పెద్ద తరహాలో ఆలోచనలు చేశారు.. ఆచరించేలా చూశారు. అంతిమ సంస్కారాల నిర్వహణలో సినారె కుటుంబ సంప్రదాయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా నిర్వహించేలా పూజారితో మాట్లాడి ఏర్పాట్లు చేయించారు. అంతిమ వీడ్కోలుకు ఏ లోటూ లేకుండా అన్నింటిపైనా ఆరా తీశారు.

సాక్షాత్తూ సీఎం శ్రద్ధ తీసుకుంటే...

సాక్షాత్తూ సీఎం శ్రద్ధ తీసుకుంటే...

వేద మంత్ర పఠనం, పోలీసు వందనం, కుటుంబ సభ్యులు దర్శించుకునేంతసేపు కేసీఆర్ మహాప్రస్థానంలోనే ఉండిపోయారు. సినారె చితికి మనుమడు నిప్పంటించిన తర్వాత సినారె కుమార్తెలు, బంధువులను సీఎం ఓదార్చారు. ముఖ్యమంత్రే గంటలపాటు ఉండిపోవడంతో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అక్కడే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వానికి, కవులు, కళాకారుల పట్ల ఉన్న శ్రద్ధను సీఎం ప్రస్ఫుటం చేశారని పలువురు వ్యాఖ్యానించారు.

అప్పుడూ అంతే...

అప్పుడూ అంతే...

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ అంతిమయాత్రలోనూ అన్నీ తానై నడిపించిన నాటి ఉద్యమ నాయకుడు, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సినారె అంతిమయాత్రనూ తాను ముందుండి నడిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 2011 జూన్ 21న కన్నుమూశారు. మరుసటి రోజు జూన్ 22న ఏకశిలా పార్కు నుంచి పద్మాక్షి గుట్ట దగ్గర శివముక్తి ధామ్ దాకా జరిగిన మహా అంతిమయాత్రను కేసీఆర్ దగ్గరుండి నడిపించారు.

ఆరేళ్ల తరువాత మళ్లీ...

ఆరేళ్ల తరువాత మళ్లీ...

కేసీఆర్ పిలుపుతో వరంగల్ రోడ్లన్నీ తెలంగాణ మార్చ్ చేశాయి. జయశంకర్ సార్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్ అగ్రనేతలు, శ్రేణులే కాదు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాసంఘాలు రోడ్ల మీద కవాతు చేశాయి. మళ్లీ ఆరేళ్ల తరువాత తిరిగి రాష్ట్రమంతా అదే చర్చ. ఆనాడు జయశంకర్ సార్ కాలం చేసినప్పుడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఎలా స్పందించారో అదే విధంగా భువి నుంచి దివికేగిన పద్మభూషణ్ డాక్టర్ సినారె అంతిమయాత్రను మహాప్రస్థానం దాకా నడిపించడం విశేషం. గొప్ప మనసున్న ఇలాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉన్నాడు.. మన తెలంగాణలో తప్ప?

English summary
Cingireddy Narayana Reddy, doyen of modern Telugu literature, was cremated with full state honours at Vaikuntha Mahaprasthanam near Filmnagar here on Wednesday amid chants of ‘CiNaRe Amar Rahe’ by scores of people, politicos, film personalities, litterateurs and others. Chief Minister K.Chandra Sekhar Rao personally involved throughout the program and shown his government's speciality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X