ఎంపీగా ఎన్నికల బరిలో దిల్ రాజు - రేవంత్ హామీ..!?
తెలంగాణలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం జోష్ ను పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. సంక్రాంతి వేళ అభ్యర్దులను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లోక్ సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ నుంచి పలువరు కొత్త అభ్యర్దులు సీట్లు ఆశిస్తున్నారు. సినీ నిర్మాత దిల్ రాజు ఎన్నికల బరిలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది.
సీట్ల కోసం పోటీ : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఇతర పార్టీల కంటే ముందుగా సయాయత్తం అవుతోంది. ఇప్పటికే లోక్ సభ అభ్యర్దుల పైన కసరత్తు ప్రారంభించింది. కేబినెట్ లోని మంత్రులకు లోక్ సభ వారీగా బాధ్యతలను అప్పగించారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దిగా నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు సంప్రదింపులు ప్రారంభించారని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ కు సన్నిహితుడా గుర్తింపు ఉంది. ఇప్పటికే చర్చలు చేసినట్లు చెబుతున్నారు. నిజామాబాద్ నుంచి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కవిత, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురం అర్వింద్ బరిలో ఉండనున్నారు. దీంతో, ఇక్కడ గెలుపు కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.

బరిలో దిల్ రాజు : నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పాటు జాతీయ అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. నిజమాబాద్ నుంచి బాల్కొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన ముత్యాల సునీల్‌రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు మైనారిటీ కోటాలో ఈ టికెట్ ఆశావహుల జాబితాలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ సైతం ఉన్నారు. మైనారిటీ కావడంతో సదరు ఓట్లు తనకు గంపగుత్తగా వస్తాయని భావిస్తున్నారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ కూడా ఎంపీ టికెట్ ఆశావహుల జాబితాలో ఉన్నారు.

సీఎం రేవంత్ ఛాయిస్ : ఈ సమయంలోనే జిల్లాలోని మోపాల్ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కూడా నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం తనవంతుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీలకు ఇవ్వాలని భావిస్తే అనిల్ కు ఇవ్వటం ద్వారా నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో బీసీ ఓట్లతో పాటు అనిల్ సామాజికవర్గానికి చెందిన పద్మశాలి ఓట్లు గంపగుత్తగా వస్తాయనే భావనలో ఉన్నారు. అదేవిధంగా మైనారిటీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌కే వస్తాయని భావిస్తున్నారు. అయితే, బీజేపీ- బీఆర్ఎస్ వ్యూహాలకు ధీటుగానే అభ్యర్దిని ఖరారు చేస్తారని చెబుతున్నారు. సామాజిక - ఆర్దిక లెక్కలు ఇక్కడ కీలకంగా మారనున్నాయి. దీంతో దిల్ రాజు సీటు విషయంలో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది చూడాలి.
-
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications