Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ..!
ఉమ్మడి ఆదిలాబాద్‍లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్ బీజేపీ ఆధిక్యంలో ఉంది. చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆసిఫాబాద్, బోథ్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. సిర్పూర్ లో పాల్వాయ్ హరీశ్ స్వల్ప మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

అదిలాబాద్ లో పాయల్ శంకర్, నిర్మల్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ రామారావు పటేల్ ఆధిక్యంలో ఉన్నారు. చెన్నూరులో గడ్డం వివేక్, బెల్లంపల్లి గడ్డం వినోద్ కుమార్ ముందంజలో ఉన్నారు. ఖానాపూర్ లో వెడ్మ బొజ్జు ఆధిక్యంలో ఉన్నారు. ఆసిఫాబాద్ లో కోవా లక్ష్మి ముందంజలో ఉండగా.. బోథ్ లో అనిల్ జాదవ్ ఆధిక్యంలో కొనసాగుతోన్నారు. సిర్పూర్ బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications