కాచిగూడలో గ్యాంగ్‌వార్, కొట్టుకున్న ఇరువర్గాలు: భయాందోళనలో స్థానికులు
హైదరాబాద్: నగరంలోని కాచిగూడ వెంకటేశ్వరనగర్‌లో బుధవారం ఉదయం గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. రెండు వర్గాలు దాడి చేసుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఓ వీధిలో పరస్పరం ఇరు వర్గాలు తీవ్రంగా దాడి చేసుకున్నాయి. కాగా, ఓ భవనంపై నుంచి ఎవరో ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి నెట్‌లో పెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

కాగా, ఈ రెండు వర్గాల దాడిలో అంబర్‌పేటకు చెందిన ముగ్గురు రౌడీ షీటర్లు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే, ఈ దాడి ఘటనను అంత సీరియస్‌గా తీసుకోని పోలీసులు.. పిటీ కేసు నమోదు చేసి దాడి చేసుకున్న వారిని వదిలేసినట్లు తెలిసింది.
మంగళవారం రాత్రే ఈ రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం ఓ వీధిలో ఇలా ముష్టి ఘాతాలతో ఒక వర్గంపై మరో వర్గం విరుచుకుపడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications