హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?

తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీలో రెండో పవర్ సెంటర్ గా మారిన ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది

|
Google Oneindia TeluguNews

తెలంగాణకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించి కార్యక్రమాలను రూపొందిస్తోంది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితర నాయకులంతా పార్టీని బలోపేతం చేయడం కోసం కృషిచేస్తున్నారు. అయితే పార్టీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రెండో పవర్ సెంటర్ గా ఈటల

రెండో పవర్ సెంటర్ గా ఈటల

తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీలో రెండో పవర్ సెంటర్ గా మారిన ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈటల బీజేపీలో చేరినప్పటినుంచి ఇది కొనసాగుతోంది. ఇటీవలికాలంలో ఈటల కొంత పైచేయి సాధించారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. వేములవాడ నుంచి సంజయ్ పోటీచేయాలనుకుంటే ఈటల అడ్డుతగిలారు. అధిష్టానం దగ్గర లాబీయింగ్ చేసి సంజయ్ ను కరీనంగర్ లో పోటీచేయాలని చెప్పించారు. అక్కడ మంత్రి గంగుల కమలాకర్ నుంచి సంజయ్ కు గట్టి పోటీ ఉంటుంది.

 రాష్ట్ర బీజేపీకి దిశా నిర్దేశం లేదు

రాష్ట్ర బీజేపీకి దిశా నిర్దేశం లేదు


కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇటీవలే హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు పార్టీ అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అందరూ ఉండగానే ఈటల ఇక్కడి పరిస్థితులను వైష్ణవ్ కు వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర బీజేపీకి దిశా నిర్దేశం లేదని చెప్పారు. కేంద్రంపై భారత రాష్ట్ర సమితి నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, వాటిని ఖండించడం, కౌంటర్ ఇవ్వడం లాంటి విషయంలో సమాచారం రావడంలేదని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటే ప్రస్తుతం చేసే పోరాటం సరిపోదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. అసలు తెలంగాణలో ఏం చేయాలి? ఎలా చేయాలి? అని చెప్పేవారు పార్టీలో లేరన్నారు.

తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన ఈటల

తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన ఈటల


ఈటల రాజేందర్ మాట్లాడే సమయంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడ్డుపడ్డారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం చేస్తోందని కేంద్రమంత్రితో చెప్పారు. అయితే.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈటలను మాట్లాడనీయాలంటూ పొంగులేటిని వారించారు. ఆయన్ను పూర్తిగా మాట్లాడనివ్వండని సూచించారు. దీంతో ఈటల తన మాటలు కొనసాగించారు. ఇదంతా సంజయ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈటల మాట్లాడినట్లుగా ఉందని, ఇంతకాలం ముసుగులో పొలిటికల్ గేమ్ ఆడిన ఈటల ఇప్పుడు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.

English summary
Bharatiya Janata Party's leadership has set itself the goal of winning the assembly elections in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X