• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆయనతో భోజనం అదృష్టం,పిలుస్తా: కేసీఆర్(పిక్చర్స్)

By Srinivas
|

మెదక్: బంగారు తెలంగాణ సాధననే లక్ష్యంగా పని చేస్తోన్న తమ ప్రభుత్వానికి శాంతా బయోటిక్ వంటి సంస్థలు చేయూత ఉంటే ఏకంగా వజ్రాల తెలంగాణనే సాకారం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

ఈ లక్ష్యసాధనకు వరప్రసాద్ రెడ్డిలాంటి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

మెదక్ జిల్లా ముప్పిరెడ్డిపల్లి వద్ద శాంతా బయోటిక్ సంస్థ నెలకొల్పనున్న మదుమేహ వ్యాధి వాక్సిన్ తయారి యూనిట్‌కు గురువారం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

 కేసీఆర్

కేసీఆర్

వ్యాపార కోణంలో కాకుండా సామాజిక సేవా దృక్ఫథంతో మదుమేహ వ్యాధికి ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న 850 రూపాయల ఇన్సులిన్‌ను కేవలం 150రూపాయలకే అందించడానికి శాంతా బయోటిక్ ముందుకు వచ్చిందని కేసీఆర్ అన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

రూ. 450 కోట్లరూపాయలతో నెలకొల్పనున్న ఈ యూనిట్ వల్ల ప్రస్తుతానికి 500 మందికి, భవిష్యత్‌లో రెండు వేల మందికి ఉపాధి లభించనుందన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

ఫార్మారంగంలో శాంతా బయోటిక్ ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని, కలరా లాంటి మహమ్మారిని నిర్మూలించడానికి శాంతా బయోటిక్ తయారు చేసిన వాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందని కొనియాడారు.

 కేసీఆర్

కేసీఆర్

ఫార్మారంగంలో శాంతా బయోటిక్ 150 అవార్డులను దక్కించుకుందని, మరే ఫార్మా కంపెనీకి ఇది సాధ్యం కాదని కేసీఆర్ అన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

శాంతా బయోటిక్ అధిపతి డాక్టర్ వరప్రసాద్‌లాంటి వ్యక్తి ముందుకు వస్తే బంగారు తెలంగాణ కాదు, ఏకంగా వజ్రాల తెలంగాణను సాధించగలమని కితాబు ఇచ్చారు.

 కేసీఆర్

కేసీఆర్

యువ శాస్తవ్రేత్తలను ప్రోత్సహించి వైద్య రంగానికి అవసరమైన మందులను, వాక్సిన్‌లను తయారు చేస్తోన్న వరప్రసాద్‌రెడ్డిలాంటి వ్యక్తి పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు మార్గదర్శకం, ఆదర్శనీయుడన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి వరప్రసాద్‌ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తుల సహాయ, సహకారాలు అవసరమని, త్వరలో ఆయనను భోజనానికి ఆహ్వానించనున్నట్టు కేసీఆర్ చెప్పారు.

 కేసీఆర్

కేసీఆర్

ఆయనతో భోజనం చేయడాన్ని తాను ఆదృష్టంగా భావిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం వల్ల నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తూ పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి 15 రోజులలో పరిశ్రమలకు అనుమతులు మంజురు చేస్తామన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా అధికారులే వారి వద్దకు వెళ్లి సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు ఒకేసారి ఇస్తారని వివరించారు.

 కేసీఆర్

కేసీఆర్

అవినీతిరహిత, ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం తమదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM K Chandraskhar Rao on Thursday said the State Government is all set to launch a new industrial policy as All India Service officers are settling down in their posts after reallocation between Telangana and Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more