షాకింగ్: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదు -రేవంత్ రెడ్డిని లోపలేస్తాం: ఫిరాయింపు ఎమ్మెల్యేలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టకముందే అధికార పక్షాన్ని డిఫెన్స్ లో పడేశారా? అనే అనుమానం కలిగేలా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ తో హస్తం గుర్తుపై గెలిచి, తర్వాతి కాలంలో టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. ఆయన కామెంట్లను ఖండిస్తూ ఫిరాయింపుదారులైన ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే..

సుధీర్ రెడ్డి అనూహ్య వ్యాఖ్యలు
హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రెండు రోజుల వ్యవధిలో రెండో సారి రేవంత్ రెడ్డికి కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. మరో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి టీఆర్ఎస్ ఎల్పీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీపీసీసీ చీఫ్ పై మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటూ రేవంత్ పిలుపునివ్వడం తమ కార్యకర్తలను హింస వైపు ప్రేరేపించడమే అవుతుందని, తద్వారా రాష్ర్టంలో అల్లకల్లోలం సృష్టించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నాడని సుధీర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ ప్రధాన ఆరోపణ అయిన 'టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం' అంశంపైనా సుధీర్ రెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు..

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదే!
''కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్సీ) అంటే ఎవరబ్బ సొత్తు? రేవంత్ అబ్బ సొత్తు కాదుగా? సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసినట్టు మేము(ఫిరాయింపుదారులు) ఏనాడూ చెప్పలేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒక గ్రూపు ఎమ్మెల్యేలం మాత్రమే టీఆర్ఎస్ లో విలీనం అయ్యాం. అది కూడా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారమే నడుచుకున్నాం. అంతేగానీ సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేశామనలేదు'' అని సుధీర్ రెడ్డి వివరణ ఇచ్చారు. 2019 జూన్ లో కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గ్రూపుగా కారెక్కడంతో సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసినట్లుగా అప్పటి శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు బులిటెన్ జారీ చేయడం తెలిసిందే. దానిపై కాంగ్రెస్ పార్టీ కోర్టుకు కూడా వెళ్లింది. ఇప్పుడు రేవంత్ విమర్శలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు మరోసారి ఆ అంశంపై వివరణ ఇచ్చుకుంటున్నారు. ఇక,

రేవంత్ రెడ్డిని లోపలేస్తాం..
ఒక ఎంపీగా మల్కాజ్ గిరి ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేని రేవంత్ రెడ్డి.. గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడు స్పీకర్ కు రాజీనామా లేఖ ఇచ్చాడా? ఇవాళ రాళ్లతో కొట్టాలంటూ రౌడీల భాష మాట్లాడుతున్నాడని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ పిల్లి కూతలకు, బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి బాగోగులు చూసుకుంటూ సేవా రాజకీయాలు చేస్తున్నామని సుధీర్ అన్నారు. రేవంత్ నోరు జారి, దిగజారుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని, గూండా మాదిరి మాట్లాడుతున్నారని... ఆయన ఇదే విధంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరని అన్నారు. ప్రచారం కోసం బజారు భాష మాట్లాడుతున్నారని... ఆయన బెదిరింపులకు ఎవరూ భయపడరని చెప్పారు. గూండాయిజం చేస్తే లోపలకు పోతావ్ అని రేవంత్ ను సుధీర్ హెచ్చరించారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications