Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హుజూర్ నగర్ ప్రచారం: ఒకే రోజు సీఎం కేసీఆర్..బాలకృష్ణ: రంగంలోకి సుహాసిని..!

హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారం తీవ్ర స్థాయికి చేరింది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రతీ పార్టీ ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో..ఇక్కడ స్టార్ క్యాంపెయినర్స్ రంగం లోకి దిగుతున్నారు. అధికార పార్టీ అభ్యర్ధికి మద్దతుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17న బహిరంగ సభలో పాల్గొననున్నారు. అదే రోజున టీడీపీ నేత..సినీ హీరో బాలకృష్ణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇక, కాంగ్రెస్ ఎంపీ..ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఈ నెల 18,19 తేదీల్లో హుజూర్ నగర్ లో ప్రచారంలో పాల్గొనే విధంగా షెడ్యూల్ ఖరారైంది. ఇక, టీడీపీ అక్కడి మహిళలను అకట్టుకొనే యత్నంలో భాగంగా..అక్కడ మహిళా అభ్యర్దికి మద్దతుగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని మూడు రోజుల పాటు కిరణ్మయికి మద్దతుగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు.

వేడెక్కుతున్న హుజూర్ నగర్ ప్రచారం
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. దీంతో ఫినిషింగ్ టచ్ ఓటర్లను ఆకట్టుకొనేలా ఉండాలనే ఉద్దేశంతో ప్రధన పార్టీల నేతలు వరుసగా నియోజకవర్గంలో ప్రచార షెడ్యూల్ ఖరారు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత ఉప ఎన్నిక ప్రచారానికి రావాలా..లేక మంత్రుల మీదనే బాధ్యత పెట్టాలా అనే కోణంలో చర్చ సాగింది. అందుకోసం మంత్రులతో పాటుగా మండలాల వారీగా ఇన్ ఛార్జ్ లను నియమించారు.

CM KCR and Balakrishna election campagin in Huzurnagar same day

అయినా..అక్కడ గెలుపు ఇప్పుడు ప్రతిష్ఠాత్మకం కావటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17న బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే విధంగా టీడీపీ అధినేత సూచన మేరకు ఆ పార్టీ నేత..సినీ బాలకృష్ణ సైతం అదే రోజున ప్రచారం చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు పరిమితం కానున్నారు. బాలకృష్ణ నియోజకవర్గంలో నాలుగు చోట్ల రోడ్ షోల్లో ప్రచారం చేసే విధంగా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు.

టీడీపీ నుండి సుహాసినీ సైతం..
తెలంగాణలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కుకట్ పల్లి నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని మూడు రోజుల పాటు కిరణ్మయికి మద్దతుగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. అభ్యర్థి మహిళ కావడం, సుహాసిని ప్రచారం.. ఇలా మహిళల ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ భావిస్తోంది. ఈ ఉప ఎన్నికలో గెలవం ద్వారా అధికార పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో షాక్ ఇవ్వాలనే పట్టుదలతో కాంగ్రెస్ సైతం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి 18, 19 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం నిర్వహించనున్నారు. 19వ తేదీ సాయంత్రం ప్రచార సమయం ముగియనుంది కాగా..21వ తేదీ పోలింగ్..24న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+