ప్రధాని వేదికపై కేసీఆర్- రేవంత్ రెడ్డి కోసం..!!
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ప్రధాని పర్యటన వేళ బీఆర్ఎస్ - కాంగ్రెస్ నిరసనలకు నిర్ణయించాయి. రెండు గంటల పాటు హైదరాబాద్ లో ప్రధాని పర్యటన కొనసాగనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తిరుపతి - సికింద్రాబాద్ వందేభారత్ ప్రారంభంతో పాటుగా స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి నేరుగా పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభకు ప్రధాని హాజరవుతారు. ప్రధాని సభలో సీఎం కేసీఆర్.. తెలంగాణ మంత్రులు..ఎంపీ రేవంత్ కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు.
ప్రధాని మోదీ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమం. ప్రధాని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభ వేదిక నుంచి దాదాపు 11వ వేల కోట్ల రూపాయాలకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పాల్గొనే సభలో ప్రోటోకాల్ ప్రకారం మోడీ చైర్ కు ఎడమవైపున కేసీఆర్ కు సీటును కేటాయించారు. సభా నిర్వహణ షెడ్యూల్ లోనే సీఎం కేసీఆర్ ప్రసంగానికి ఏడు నిమిషాల సమయం ఖరారు చేసారు. అయితే, గత కొంత కాలంగా ప్రధాని పర్యటనలకు దూరంగా ఉంటున్న సీఎం కేసీఆర్ ఈ రోజు హాజరు కావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తలసాని బేగంపేట విమనాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలకనున్నారు.

పరేడ్ గ్రౌండ్లో జరిగే ప్రధాని మోదీ సభలో స్టేజ్ పై సీఎం కేసీఆర్ కోసం కుర్చీ ఏర్పాటు..!!#PMModi #Modi #KCR #CMKCR #VandeBharatExpress #VandeBharatTrain #Oneindiatelugu pic.twitter.com/4PQwxUXlG7
— oneindiatelugu (@oneindiatelugu) April 8, 2023
అదే విధంగా ఆర్ అండ్ బి మంత్రి ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్ స్థానిక మంత్రి మహమూద్ అలీకి ప్రోటోకాల్ మేరకు ఆహ్వానాలు పంపిన అధికారులు..ప్రధాని సభలో సీట్లు కేటాయించారు. అయితే, సీఎం పూర్తిగా పర్యటనకు దూరంగా ఉండటంతో మంత్రి తలసాని ప్రధానికి ఆహ్వానం వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇతర మంత్రులు హాజరయ్యే ఛాన్స్ లేదు. ఇక, పూర్తిగా అధికారిక కార్యక్రమం కావటంతో ప్రధాని ప్రసంగంలో రాజకీయ ప్రస్తావన ఉంటుందా లేదా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications