హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లెఫ్ట్ గిఫ్ట్ జాన్తానై.. దోస్త్ గీస్త్ ధూం ధాం??

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తే వరుసగా హ్యాట్రిక్ సాధించినట్లవుతుంది. మూడోసారి అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా సమర శంఖం పూరించారు. సిట్టింగ్ లందరికీ సీట్లివ్వనున్నట్లు ప్రకటించారు. గతంలో కేసీఆర్ నుంచి ఈ ప్రకటన వచ్చినప్పటికీ ఎమ్మెల్యేలకు నమ్మకం కలగలేదు. పనితీరు బాగోలేనివారిని, సర్వే రిపోర్టుల్లో వ్యతిరేకత వచ్చినవారిని మారుస్తారనే ఉద్దేశంలో ఉండేవారు. అయితే తాజాగా జరిగిన సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లివ్వనున్నట్లు ప్రకటించడంతో గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు.

ఉభయ కమ్యూనిస్టుల్లో నిరాశ

ఉభయ కమ్యూనిస్టుల్లో నిరాశ

అయితే కేసీఆర్ తాజా ప్రకటన ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో నిరాశను కలగజేసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని పోటీచేసిన టీఆర్ఎస్ భవిష్యత్తులోను కలిసే పోటీచేస్తామని ప్రకటించింది. దీంతో సీపీఐ, సీపీఎంల్లో ఆశలు చిగురించాయి. పదుల సంఖ్యలో అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందని 'ఎర్ర నేతలు' అంచనా వేశారు. అయితే సిట్టింగ్ లందరికీ సీట్లని కేసీఆర్ ప్రకటించడంతో కమ్యూనిస్టులు బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు ఎంతలేదన్నా ఉభయ కమ్యూనిస్టులకు 20 సీట్లు కేటాయిస్తారనే అంచనాలున్నాయి.

ఉత్సాహంగా ఎమ్మెల్యేలు

ఉత్సాహంగా ఎమ్మెల్యేలు


నిన్నటివరకు సీటిస్తారో? లేదో? అంటూ బితుకు బితుకుమంటూ ఉన్న ఎమ్మెల్యేలకు తాజా ప్రకటన ఉత్సాహాన్ని కలిగించింది. లెఫ్ట్ పార్టీలను సైడ్ చేశారా? అనే అనుమానాలు కూడా రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉత్సహాన్ని నింపేందుకు, రాబోయే 10 నెలలు శ్రమించేందుకు ఈ ప్రకటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

నామినేటెడ్ పదవులపై హామీ

నామినేటెడ్ పదవులపై హామీ

సిట్టింగ్ లందరికీ సీట్లనే ప్రకటనద్వారా టీఆర్ ఎస్ లో అసమ్మతి తలెత్తుతుందని అంచనా వేస్తున్నారు. వ్యతిరేకత వ్యక్తమవుతున్న కొందరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సీట్లు ఆశిస్తున్నవారు డీలా పడ్డారు. మరికొందరు పార్టీని వీడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరికొందరు బలమైన నాయకులు, పార్టీకి అవసరమైనవారిని వదులుకోకుండా శాసనమండలికో, రాజ్యసభకో పంపిస్తాననే హామీని కేసీఆర్ ఇవ్వవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కేసీఆర్ చేసిన సిట్టింగ్ లందరికీ సీట్లనే ప్రకటన కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిల్చిందని చెప్పవచ్చు.

English summary
If the Telangana Rashtra Samithi wins the next election, it will be a consecutive hat-trick
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X