• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం పదవి అవసరమా?: ఎన్నో ప్రశ్నలు... కెటిఆర్‌ని వెనుకేసుకొచ్చిన కెసిఆర్

By Srinivas
|

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడి తన ప్రెస్ మీట్లో అడుగడుగునా తన తనయుడు, మంత్రి కెటి రామారావును వెనుకేసుకు వచ్చినట్లుగా కనిపించింది. వంద సీట్లు గెలవకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ చెప్పారా, విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని కెసిఆర్ అన్నారు.

కెటిఆర్ ఇప్పుడున్న స్థాయికి ముఖ్యమంత్రి అవసరమా అన్నారు. మేయర్ పీఠం పైన గులాబీ జెండా ఎగిరిందని, దానిని ఎవరూ ఆపలేర్నారు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేమన్నారు. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమ పార్టీ ఉంటుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల సర్వేలు కూడా అదే చెబుతున్నాయన్నారు.

మేజిక్ ఫిగర్ 75 సీట్లకు మూడు నాలుగు తక్కువ పడితే మజ్లిస్ పార్టీ ఉందని, అది తమ మిత్రపక్షం అన్నారు. తెరాసకు మిత్రపక్షం అని మజ్లిస్ అసెంబ్లీలోనే చెప్పిందన్నారు. ఫలితం తేలిందని, తేలాల్సింది సీట్ల లెక్కేనని మొన్న నమస్తే తెలంగాణ రాసిందన్నారు. మంత్రి కెటిఆర్ మజ్లిస్‌ను మతతత్వ పార్టీ అన్నారు కదా అంటే.. మతతత్వం ఏమో కానీ మజ్లిస్ తమకు మిత్రపక్షం అన్నారు.

CM KCR backs Minister KTR in his press meet

మజ్లిస్ మీద కెటిఆర్ వ్యాఖ్యలపై కెసిఆర్

మజ్లిస్ పార్టీని మీరు మిత్రపక్షం అంటున్నారని, కెటిఆర్ మతతత్వ పార్టీ అంటున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా.. వాళ్ల బ్లడ్ గ్రూప్, వాళ్ల రక్తం చూసుకోవాలా అని ప్రశ్నించారు. ఒకరు బిజెపిని, మరొకరు మజ్లిస్ పార్టీని అంటుంటారని, అవి తమకు అనవసరమని చెప్పారు.

మతతత్వ పార్టీ అని కెటిఆర్ అన్నారు కదా.. అంటే ఎవరో అన్న ముచ్చట నాతో చెబితే ఎలా, వారినే ప్రశ్నించాలని చెప్పారు. తద్వారా కెటిఆర్.. మజ్లిస్ పార్టీని అన్న మతతత్వ పార్టీ వ్యాఖ్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు.

రాజ్యాంగంలో లేదు

మీ కేబినెట్లో మంత్రులుగా మహిళలకు చోటు లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయని ప్రశ్నించగా.. కేబినెట్లో మహిళలు ఉండాలని రాజ్యాంగంలో లేదన్నారు.

కెటిఆర్ చేస్తే డమ్మీ అవుతారా

ఇతర మంత్రులను మంత్రి కెటిఆర్ డమ్మీగా చేస్తున్నారనే ఓ విలేకరి ప్రశ్నకు కెసిఆర్ స్పందిస్తూ... ఒకరు డమ్మీ చేస్తే మరో మంత్రి డమ్మీ అవుతారా అని ప్రశ్నించారు.

కెటిఆర్ ఏ అధికారంతో శంకుస్థాపన చేస్తున్నారని విపక్షాలు అడగడం విడ్డూరమన్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా చేస్తున్నారన్నారు. ప్రతి మంత్రికి ఎక్కడైనా అధికారం ఉంటుందన్నారు. స్థానికులు కెటిఆర్‌ను రమ్మంటే వెళ్తున్నారని, ఏం విమర్శించాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో బోర్ల వాడకం తగ్గడం వల్లే విద్యుత్ సమస్య తగ్గిందని విపక్షాలు చెప్పడం విడ్డూరమని కెసిఆర్ అన్నారు. జాబితా చూసుకోవాలన్నారు. రెవెన్యూ యాక్టును అడ్డం పెట్టుకొని హైదరాబాదులో వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయన్న ప్రశ్నకు స్పందిస్తూ... చర్యలు తీసుకుంటామన్నారు.

బీఫ్ తినడంపై మాట్లాడుతూ... తినడం విషయంలో గొడవ ఏమిటన్నారు. బీఫ్‌ను రాజకీయం చేయడం విడ్డూరమన్నారు. బీఫ్ తినడాన్ని రాజకీయం చేసే దౌర్భాగ్య స్థితికి వెళ్లడం ఏమిటన్నారు.

తాము గతంలో చెప్పిన హుస్సే సాగర్ పరిశుభ్రత, ఆకాశ హర్మ్యాలు, కొత్త సచివాలయ నిర్మాణం, చెస్ట్ ఆసుపత్రి తరలింపు అన్నీ ఉంటాయన్నారు. కొత్త సచివాలయం కట్టాలంటే ఓ ప్రణాళిక కావాలన్నారు. హైదరాబాదును ప్రపంచస్థాయికి తీసుకు వెళ్తామన్నారు.

తాము చేసిన పనులనే కెసిఆర్ తన ఘనతగా చెప్పుకుంటున్నారన్న కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించారు.. ఏవీ వారి ఆలోచనలు కాదన్నారు. మిషన్ భగీరథ వారి ఆలోచన అయితే, ఎందుకు పూర్తి కాలేదన్నారు.

మజ్లిస్ పార్టీతో అంతర్గత ఒప్పందంపై మాట్లాడుతూ.. తమకు అలాంటిదేమీ లేదన్నారు. తాను కొత్త సిటీకి, పాత సిటీకి వెళ్లడం లేదని, ఎల్లుండి పరేడ్ మైదానంలో సభలో పాల్గొంటున్నానని చెప్పారు. అంతకుమించి ఎక్కడా ప్రచారం చేయడం లేదన్నారు. తాము 150 స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు.

English summary
CM K Chandrasekhar Rao backs Minister KTR in his press meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X