మనీష్ సిసోడియా అరెస్టును ఖండించిన కేసీఆర్: మోడీపై ఆగ్రహం, కేరళ సీఎం కూడా

హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మోడీ-అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు తప్ప మరొకటి లేదని అన్నారు.

మరోవైపు, కేరళ సీఎం పినరయి విజయన్ కూడా సిసోడియా అరెస్టును ఖండించారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారని, ఇందుకు ఇదొక ఉదాహరణ అని బీజేపీపై మండిపడ్డారు. దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఇది కఠోరమైన అధికార దుర్వినియోగమని వ్యాఖ్యానించారు. ఇలాంటి అణిచివేత మనదేశం పునాదిని దెబ్బ తీస్తుందని, దీన్ని ప్రతిఘటించాలని విజయన్ పిలుపునిచ్చారు.

CM KCR condemns Delh Dy CM Manish Sisodia arrest: slams on modi-adani

ఇప్పటికే మంత్రి కేటీఆర్, హరీశ్ రావు.. సిసోడియా అరెస్టును ఖండిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. రతిపక్షాలను టార్గెట్ చేయడం, ఎమ్మెల్యేల కొనుగోలు చేయడం, దారికి రాకుంటే తమ భాగస్వాములైన ఈడీ, సీబీఐతో దాడులు చేయడం బీజేపీకి పరిపాటిగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు.
ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను కూల్చిందని ఆరోపించారు.
గత ఎనిమిదేళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంత మంది బీజీపీ నాయకుల మీద ఐటీ దాడులు, సీబీఐ దాడులు జరిగాయని కేటీఆర్ ప్రశ్నించారు. వీరంతా ఏమైనా సత్య హరిశ్చంద్రుడుకి బంధువులా? అని ప్రశ్నించారు. ప్రధాని సన్నిహితులను ఎలా కాపాడుతున్నారని దేశం దేశ ప్రజలు చూస్తున్నారని అన్నారు.

సిసోడియాను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. బీజేపీ తన ప్రత్యర్థి పార్టీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్నుశాఖలతో బెదిరిస్తోందన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే సిసోడియా అరెస్ట్ చేశారన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కక్ష సాధింపు చర్యగానే మనీశ్ సిసోడియా అరెస్ట్ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిసోడియాను సోమవారం ఢిల్లీ కోర్టు సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మార్చి 4 వరకు సీబీఐ కస్టడీలోనే సిసోడియా ఉండనున్నారు. లిక్కర్ స్కాంకు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+