కొత్త సచివాలయంలో కేసీఆర్ తొలి సమీక్ష: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) నూతన సచివాలయంలో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పథకం అమలు తీరుపై, తాగునీటి కోసం చేపట్టిన పనులపై సమావేశంలో మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు.
సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి అనుమతించిన నేపథ్యంలో ఈ రోజు సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కూలంకంషంగా చర్చించారు. ఇందులో భాగంగా జూలై వరకు కరివెన జలాశయంకు నీళ్ళు తరలించాలని, ఆగష్టు వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాటి సంబంధిత పంప్ హౌజ్ లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఒక రిజర్వారయ్ నుంచి మరొక రిజర్వాయర్ కు నీటిని తరలించే 'కన్వేయర్ సిస్టమ్' లో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. వాటిలో మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మరి జనార్దన్‌రెడ్డి, కాలె యాదయ్య, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, అంజయ్య యాదవ్, ప్రకాశ్ గౌడ్, మహేశ్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ హాజరయ్యారు.

స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్ పాండే, ఈఎన్సీ మురళీధర్ రావు, అడ్వైజర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెంటారెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సీఈలు హమీద్ ఖాన్, ధర్మా, ఎస్ఈలు రంగారెడ్డి, శ్రీనివాస్, విజయ భాస్కర్ రెడ్డి, చక్రధర్, ఎఎస్ఎన్ రెడ్డి, ట్రాన్స్ కో డైరక్టర్ సూర్య ప్రకాశ్, డీఈ పీఆర్ఎల్ఐఎస్ సయ్యద్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications