సత్తా చాటారు: కుమారస్వామి, దేవెగౌడను కలిసిన కేసీఆర్, ప్రమాణస్వీకారానికి గైర్హాజరు
హైదరాబాద్: ప్రాంతీయ పార్టీ సత్తా ఏంటో కర్ణాటక ఫలితాలు చూపించాయని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. కాబోయే కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి, మాజీ ప్రధాని దేవె గౌడలకు చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు.
కర్ణాటక సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామిని కేసీఆర్ మంగళవారం సాయంత్రం స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రాంతీయ పార్టీల విజయానికి కర్ణాటక ఫలితమే నాంది అని అన్నారు.

ఆహ్వానం మేరకు
సీఎం కేసీఆర్‌ను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కుమారస్వామి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం బెంగళూరు బయల్దేరి వెళ్లారు.

సీఎం కేసీఆర్ వెంట..
సీఎం కేసీఆర్ వెంట స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కేకే సంతోష్ కుమార్, వినోద్, మిషన్ భగీరథ ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.

సాదర స్వాగతం
దేవేగౌడ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. దేవేగౌడ స్వయంగా పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్.. దేవేగౌడకు, కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కుమారస్వామిని శాలువాతో సత్కరించారు.

అత్యవసర సమావేశాల వల్లే..
మంత్రులను, ఎంపీలను పరిచయం చేశారు. బుధవారం అత్యవసర సమావేశాల దృష్ట్యా సీఎం బెంగళూరు నుంచి మంగళవారం రాత్రికే హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలతో వేదికను పంచుకునేందుకు ఇష్టంలేని కారణంగానే కేసీఆర్.. ఇవాళే కుమారస్వామి, దేవెగౌడలను కలిసి అభినందనలు తెలిపినట్లు తెస్తోంది.












Click it and Unblock the Notifications