వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాస నేతలకు కేసీఆర్ పండుగ కానుక, వరంగల్‌కు ప్రాధాన్యం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో నేతలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దసరా కానుక ఇచ్చారు. ఆదివారం నాడు తొమ్మిది మంది కార్పోరేషన్ చైర్మన్లను నియమించారు. ఈ పోస్టుల్లో తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేశారు. కేసీఆర్ పోస్టులను భర్తీ చేస్తుండటంతో తెరాసలో సందడి నెలకొంది.

తొలుత తొమ్మిది మంది పార్టీ నాయకులకు పదవులు దక్కాయి. ఒకటి రెండు రోజుల్లో మరికొందరిని కూడా ఈ పదవులను వరించనున్నాయి. ఆదివారం ఎనిమిది మందిని రాష్ట్రస్థాయి సంస్థలకు, ఒకరిని వరంగల్‌లోని కాకతీయ నగరాభివృద్ధి సంస్థకు ఛైర్మన్లుగా నియమించారు.

వీరి నియామకంపై సోమవారం ఉత్తర్వులు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు తెలంగాణలోని పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు చాలామందికీ రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులను ఇవ్వాలని సీఎం కేసీఆర్నిర్ణయించారు. దసరా రోజున లేదా ఆ తర్వాత రోజున ఈ నియామకాలు జరుగుతాయి.

CM KCR fills nominated posts in Telangana

దీనిపై శనివారం కేసీఆర్‌ కసరత్తు చేశారు. కానీ కొన్ని శాఖల నుంచి సమాచారం అందకపోవడంతో వాయిదా పడినాయి. గత రెండేళ్లలో ఒకేసారి ఇంతమందికి నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వడం ఇదే మొదటిసారి. పదవుల పంపిణీలో వరంగల్‌ జిల్లాకు ప్రాధాన్యం కల్పించారు.

వరంగల్‌ జిల్లా నర్పంపేట ఇంచార్జ్, తెరాస పోలిట్‌బ్యూరో సభ్యుడైన పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాల నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్‌ నేతలు కన్నెబోయిన రాజయ్య యాదవ్‌, లింగంపల్లి కిషన్‌రావు, హన్మకొండకు చెందిన తెలంగాణ గ్రాడ్యుయేట్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మర్రి యాదవ రెడ్డిలకు పోస్టులు లభించాయి.

పౌరసరఫరాల సంస్థ - పెద్ది సుదర్శన్ రెడ్డి, టీఎస్‌ ఆగ్రోస్ - లింగంపల్లి కిషన్ రావు, టీఎస్‌ ఐఐసీ - జి బాలమల్లు, క్రీడాప్రాధికార సంస్థ - ఏ వెంకటేశ్వర్ రెడ్డి, గొర్రెలు, మేకలు అభివృద్ధి సంస్థ - రాజయ్య యాదవ్‌, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ - మర్రి యాదవ రెడ్డి, నీటిపారుదల అభివృద్ధి సంస్థ - ఈ శంకర్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ - బండ నరేందర్ రెడ్డి,
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ - మందుల శామ్యూల్ ఉన్నారు.

కాగా, ఆదివారం నాడు వరంగల్ జిల్లాలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ ప్రతిపక్షాల పైన మండిపడ్డారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని, జిల్లాలు కావాలంటారని, మళ్లీ శాస్త్రీయత లేదంటారని ధ్వజమెత్తారు. సీపీఎం నేతలు క్షమాపణ చెప్పాకే తెలంగాణలో తిరగాలని డిమాండ్ చేశారు.

English summary
CM K Chandrasekhar Rao fills nominated posts in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X