ఆ మూడు జిల్లాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మొత్తం 30జిల్లాలు
హైదరాబాద్ : దసరా సందర్బంగా.. కొత్త జిల్లాల కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, పలు ప్రజా ఉద్యమాలు, ఆందోళనలతో గద్వాల, సిరిసిల్ల, జనగామ జిల్లా కేంద్రాల ప్రతిపాదన కూడా తెరపై ఊగిసలాడిన తరుణంలో ఈ మూడు జిల్లాలకు సీఎం కేసీఆర్ ఓకె చెప్పేశారు.
ఈ మూడు జిల్లాల డిమాండ్ తో పునరాలోచనలో పడ్డ సీఎం కేసీఆర్ కొత్త ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకుని.. మొత్తం 30 జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా టీఆర్ఎస్ మంత్రి ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్ అందరి మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో 27 జిల్లాలు కాస్త 30కి పెరగ్గా.. దసరా నుంచే ఈ కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. కొత్తగా జాబితాలో చేరిన జిల్లాలకు ప్రత్యేక నోటిఫికేషన్ లాంటిది ఏమి లేకుండానే ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించే అవకాశముంది. కాగా, కొత్తగా చేరిన మూడు జిల్లాలతో కరీంనగర్, మహబూబ్ నగర్ నాలుగు జిల్లాలు గాను, వరంగల్ ఐదు జిల్లాలు గాను విభజించబడనుంది.












Click it and Unblock the Notifications