హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం.. బడ్జెట్ తేదీల ఖరారు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ వార్షిక బడ్జెట్ సమావేశాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న ఆయా శాఖల మంత్రులు, సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. బ‌డ్జెట్‌లో శాఖ‌ల వారిగా కేటాయింపులు.. తేదీల ఖ‌రారుపై చ‌ర్చిస్తారు.

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బడ్జెట్‌పై ప్రధానంగా చర్చిస్తారు . దాన్ని ఏ రోజున ప్రవేశపెట్టాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. అందరితో చర్చించిన అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేస్తారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ మఖ్యకార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరు కానున్నారు.

శాఖ‌ల వారిగా నిధుల కేటాయింపులు

శాఖ‌ల వారిగా నిధుల కేటాయింపులు


ప్రధానంగా బడ్జెట్ రూపకల్పన ఏవిధంగా ఉండాలి , ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపై మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో కూలంకుషంగా సీఎం కేసీఆర్ చర్చిస్తారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన దళితబంధుకు నిధుల కేటాయింపులపై కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఎలాంటి కసరత్తుతో ముందుకు వెళ్లాలని అన్నదానిపై కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

మార్చి 4 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు?

మార్చి 4 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు?


ఈసారి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 4 నుంచి ఉండే అవకాశం ఉంది. మార్చి 28 యాదాద్రి ఆలయం మహాకుంభ సంప్రోక్షణ ఉంది. ఈ నేపథ్యంలో ఆలోపే ఈ బడ్జెట్ సమావేశాలను ముగించే అవకాశం ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఈసారి బడ్జెట్ సమావేశాలు 12 రోజుల పాటు నిర్వహించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతంలోలా ఒకేసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారా?. లేక ఈసారి రెండు విడుతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా ? అన్నదానిపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

దేశ రాజ‌కీయ‌ల‌పై కూడా చ‌ర్చ‌...

దేశ రాజ‌కీయ‌ల‌పై కూడా చ‌ర్చ‌...


అటు దేశ రాజకీయలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీజేపీపై మరింత దూకుడుతో ముందుకు వెళ్లాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్డీయేతర సీఎంలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ లో భేటీ అవుతారని సమాచారం.

English summary
CM KCR key meeting with ministers and officials over telangana budget sessions..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X