జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోల్‌మాల్ గోవిందగాళ్లు: బీజేపీ, మోడీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

జగిత్యాల: మరోసారి కేంద్రం, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రధాని మోడీ తీసుకొచ్చిన మేకిన్ ఇండియాతో ఎవరికి మేలు జరిగిందని ప్రశ్నించారు. బొమ్మలు, జాతీయ జెండా కూడా చైనా నుంచే కొనుక్కుంటున్నామని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం జగిత్యాల పట్టణంలోని మోతెలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ బాగుంటే సరిపోదని.. దేశం కూడా బాగుండాలన్నారు. అందుకే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నామన్నారు.

మోడీ కుట్రలు చేస్తున్నారంటూ కేసీఆర్ ఫైర్

మోడీ కుట్రలు చేస్తున్నారంటూ కేసీఆర్ ఫైర్

కేంద్రం చేతగాని విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం రూ. 3 లక్షల కోట్లు నష్టపోయిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. మనచుట్టూ గోల్ మాల్ గోవిందగాళ్లు చేరారు.. అప్రమత్తంగా లేకుంటే నష్టపోతామని అన్నారు. చిన్నపొరపాటు వల్ల 60 ఏళ్లు నష్టపోయిన చరిత్ర మనదన్నారు. కేంద్రం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకూడదంటోందన్నారు. ఎనిమిదేళ్లలో ఎన్పీఏల పేరుతో రూ. 14 లక్షల కోట్ల ప్రజల ఆస్తులను దోచిపెట్టిందని బీజేపీపై మండిపడ్డారు. ఎల్ఐసీని అమ్మేస్తారట అని ధ్వజమెత్తారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయాలని మోడీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీలకిచ్చే నిధులు కోత పెట్టారని ఆరోపించారు.

కొంగట్టు అంజన్న ఆలయానికి రూ. 100 కోట్లు: కేసీఆర్

కొంగట్టు అంజన్న ఆలయానికి రూ. 100 కోట్లు: కేసీఆర్

జగిత్యాల జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టే జగిత్యాల జిల్లాగా ఏర్పడింది. రాష్ట్రం కోసం ఉద్యమం జరిగే సమయంలో ధర్మపురికి వచ్చినప్పుడు.. గోదావరి పుష్కరాలు మా దగ్గర ఎందుకు నిర్వహించరని అనాడు సింహంలా గర్చించానని చెప్పారు. జగిత్యాల జిల్లాలో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కొంగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అంజన్న ఆలయానికి ఇప్పటికే 384 ఎకరాలు ఇచ్చామని, ప్రఖ్యాత స్థపతులను తీసుకొచ్చిన కొండగట్టును అభివృద్ధి చేస్తామన్నారు.

పది రోజుల్లో రైతుబంధు నగదు ఖాతాల్లో జమ అంటూ కేసీఆర్

పది రోజుల్లో రైతుబంధు నగదు ఖాతాల్లో జమ అంటూ కేసీఆర్


రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నాం. సంవత్సరానికి 13,14వేలకోట్లు కరెంటు బిల్లు కింద రైతులు చెల్లించకుండా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం కోరుట్ల, మెట్‌పల్లి, చొప్పదండి, కరీంనగర్‌ ప్రాంత వాసులకు బాగా తెలుసు. ఎన్ని మోటార్లు పెట్టావ్‌? ఎంత హెచ్‌పీలు ఉన్నయ్‌? ఎంత బిల్లు కడుతువ్‌ అని అడిగే కొడుకు ఉన్నడా? దానికి మీటర్లు పెట్టమంటున్నరు? వరద కాలువ తూముల్లో మోటార్లు పెట్టి పంటలు పండించుకొని బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం' అని సీఎం కేసీఆర్ అన్నారు. కాగా, అంతకుముందు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

English summary
Telangana CM KCR hits out BJP and PM Modi in Jagtial public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X