CM KCR: భారత్ భవన్‍కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్..

సీఎం కేసీఆర్ అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్న భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో నిర్మించనున్న ఈ భవనానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రె్డడి, మల్లారెడ్డి, ఎంపీలు కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వర రావు, బీబీ పాటిల్, సురేష్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శంభీపూర్ రాజు, మధుసూదనా చారి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చండీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. దేశంలో ఏ పార్టీకి కూడా లేని విధంగా భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ భవనంలో రాజకీయ శిక్షణా తరగతులతో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఇప్పటికే నిర్మించుకుంది. రాష్ట్రాల్లో కూడా పార్టీ కార్యాలయాలు నిర్మించనుంది.

CM KCR laid the foundation stone of Bharat Bhavan in Kokapet

ఈ భవనంలో శిక్షణకు వచ్చే వారికి బస చేసేందుకు అవసరమైన వసతి ఏర్పాట్లు కూడా చేయనున్నారు. ఈ శిక్షణా తరగతులను దేశంలో పేరు పొందిన సంస్థల్లో పని చేసే వారితో నిర్వహించనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారులు, న్యాయనిపుణులు, రాజకీయలపై పట్టు ఉన్నవారిని ఈ శిక్షణా తరగతులకు సమన్వయకర్తలుగా నియమించనున్నారు. ఈ భవన నిర్మాణ పనులు త్వరలోనే మొదలు పెట్టనున్నారు. తర్వితగతిని పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేనున్నారు.

భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీ భవనంలో అతి పెద్ద డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తారు. నిర్మాణం పూర్తి అయిన తర్వాత సీఎం కేసీఆర్ పార్టీ కార్యక్రమాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+