మైక్రోసాప్ట్ భారీ క్యాంపస్ ఎవరికి?: రేసులో బెంగుళూరు, హైదరాబాద్
హైదరాబాద్: ఐటీ దిగ్గజం మైక్రోసాప్ట్ భారత్‌లో త్వరలో ఓ భారీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. సుమారు 6700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్ ఏడు వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. అయితే మైక్రోసాప్ట్ ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్ కోసం హైదరాబాద్, బెంగుళూరు పోటీ పడుతున్నాయి.
మైక్రోసాప్ట్‌కు హైదరాబాద్‌తో సహా దేశంలో ఇప్పటికే 13 నగరాల్లో ఆఫీసులు ఉన్నాయి. భారతలో వంద కోట్ల డాలర్ల పెట్టుబడితో మరో భారీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించుకుంది. అయితే దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

భారత్‌లో ఏర్పాటు చేయనున్న ఈ భారీ క్యాంపస్ కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్, బెంగళూరు నగరాలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన టెక్నాలజీ (ఐసీటీ)పై కొత్త విధానాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది.
ఏప్రిల్ 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ఐసీటీపై కొత్త పాలసీని ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సహా పలువురు ఐటీ ప్రముఖులు పాల్గొంటారని కేటీఆర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ''ఐటీ రంగం తెలంగాణ రాష్ట్రంలో బాగా విస్తరిస్తుంది. దీనికోసం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పండి'' అని కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
Telangana ICT policy launch on 4th April, 2016 at HICC by Hon'ble CM Sri KCR & Infosys' Mr. Narayana Murthy.Other ICT stalwarts will join in
— KTR (@KTRTRS) 24 March 2016
''దేశంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్ నగరాలే అనువైనవని అందరూ గుర్తిస్తున్నారు. ఇటీవలి భారీ వరదలతో చెన్నై నుంచి కొన్ని కంపెనీలు వెనక్కి మళ్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా సంస్థలు హైదరాబాద్ నగరంపై ఉన్న అంచనాలు, నమ్మకానికి తగినట్లుగా గట్టి చర్యలు తీసుకోండి. పెట్టుబడులకు అవసరమైన పూర్వరంగాన్ని సిద్ధం చేయండి. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని చక్కగా సృష్టించారంటూ ప్రధానమంత్రి కూడా మనల్ని ప్రశంసించారు. ఇది సాధారణ విషయం కాదు. అందుకే పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై మరింత విస్తృత ప్రచారం కల్పించండి'' అని కేసీఆర్ అధికారులతో అన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications