రామాలయంలో కెసిఆర్: ప్రాజెక్టుల శంకుస్థాపన, కోటి ఎకరాలకు నీరు
ఖమ్మం: తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చుకునేందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ పచ్చని పంటలతో కళకళలాడాలన్న కలలు వందశాతం కచ్చితంగా సాకారమవుతాయని అన్నారు. గోదావరి, కృష్ణ జీవనదులను తెలంగాణకు మళ్లించి కోటి ఎకరాలు సాగులోనికి తీసుకురావటమే బంగారు తెలంగాణ లక్ష్యమన్నారు.
కోటి ఎకరాలకు నీరు వచ్చే వరకు, 24 గంటలు త్రీఫేజ్ కరెంటు వచ్చే వరకు, రాష్ట్రంలో ఉన్న దళితులు, గిరిజనులు, క్రిస్టియన్, మైనార్టీలు అన్ని విధాలా అభివృద్ధి చెందే వరకు తన ప్రాణం పోయినా రాజీ పడనని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ముదిగొండ మండలం ముత్తారంలోని రామాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం తిరుమలాయపాలెం వద్ద రూ.92 కోట్లతో చేపడుతున్న భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి, టేకులపల్లి మండలం రోళ్లపాడులో రూ.8 వేల కోట్లతో చేపడుతున్న సీతారామ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
రాబోయే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం సాగునీటిరంగానికి, రైతాంగానికి నీళ్లు ఇవ్వటానికి రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చుపెట్టబోతున్నదని చెప్పారు. సాగు, తాగు నీరు, విద్యుత్ కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడటమే బంగారు తెలంగాణ లక్ష్యమని వివరించారు.
కాగా, టిడిపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఆయన భార్య పోట్ల మాధవి, కాంగ్రెస్ నేత, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్ మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.

రామాలయంలో కెసిఆర్
తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చుకునేందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

రామాలయంలో కెసిఆర్
యావత్ తెలంగాణ పచ్చని పంటలతో కళకళలాడాలన్న కలలు వందశాతం కచ్చితంగా సాకారమవుతాయని అన్నారు.

రామాలయంలో కెసిఆర్
గోదావరి, కృష్ణ జీవనదులను తెలంగాణకు మళ్లించి కోటి ఎకరాలు సాగులోనికి తీసుకురావటమే బంగారు తెలంగాణ లక్ష్యమన్నారు.

రామాలయంలో కెసిఆర్
కోటి ఎకరాలకు నీరు వచ్చే వరకు, 24 గంటలు త్రీఫేజ్ కరెంటు వచ్చే వరకు, రాష్ట్రంలో ఉన్న దళితులు, గిరిజనులు, క్రిస్టియన్, మైనార్టీలు అన్ని విధాలా అభివృద్ధి చెందే వరకు తన ప్రాణం పోయినా రాజీ పడనని స్పష్టం చేశారు.

మంత్రి హరీశ్ రావు
ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ముదిగొండ మండలం ముత్తారంలోని రామాలయాన్ని ఆయన దర్శించుకున్నారు.

రామాలయంలో కెసిఆర్
అనంతరం తిరుమలాయపాలెం వద్ద రూ.92 కోట్లతో చేపడుతున్న భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి, టేకులపల్లి మండలం రోళ్లపాడులో రూ.8 వేల కోట్లతో చేపడుతున్న సీతారామ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

రామాలయంలో కెసిఆర్
రాబోయే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం సాగునీటిరంగానికి, రైతాంగానికి నీళ్లు ఇవ్వటానికి రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చుపెట్టబోతున్నదని చెప్పారు.

రామాలయంలో కెసిఆర్
సాగు, తాగు నీరు, విద్యుత్ కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడటమే బంగారు తెలంగాణ లక్ష్యమని వివరించారు.

ప్రాజెక్టులకు శంకుస్థాపన
మంగళవారం ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద సీతారామ ప్రాజెక్ట్‌కు, తిరుమలాయపాలెం మండల కేంద్రంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభల్లో సీఎం ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఇపుడు తెలంగాణలో, తెలంగాణ బిడ్డల పాలనలో మన ప్రాజెక్టులు మనమే నిర్మించుకుంటున్నామని అన్నారు.

సీఎం కెసిఆర్
సాగునీటితో పాటు మిషన్ భగీరథ పథకంతో తాగునీరు కూడా అందిస్తామని, వచ్చే రెండున్నర ఏండ్లలో 24 గంటలు త్రీఫేస్ కరెంటు కూడా సరఫరా చేసి రైతులను ఆదుకుంటామని చెప్పారు.

సీఎం కెసిఆర్
టిడిపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఆయన భార్య పోట్ల మాధవి, కాంగ్రెస్ నేత, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్ మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications