ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయండి.. అధికారులకు దిశానిర్దేశం.. పాలమూరు పర్యటనలో సీఎం

Recommended Video

    సన్నాసులు అంటూ విపక్షాలపై KCR ఆగ్రహం..!! || KCR Busy In The Tour Of Joint Mahabubnagar District

    హైదరాబాద్ : తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన బిజీ షెడ్యూల్‌గా మారింది. తొలుత పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్‌కు సంబంధించిన పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆ మేరకు ప్రాజెక్టుల పనితీరును, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు.

     పాలమూరులో సీఎం కేసీఆర్ బిజీ బిజీ.. 8 గంటలకు పైగా పర్యటన

    పాలమూరులో సీఎం కేసీఆర్ బిజీ బిజీ.. 8 గంటలకు పైగా పర్యటన

    సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయా ప్రాజెక్టులను పరిశీలిస్తూ ఎంతమేర పురోగతి సాధించారనే విషయం అధికారులను అడిగి తెలుసుకున్నారు. గురువారం నాడు రోజంతా పాలమూరు పర్యటనకే కేటాయించడం విశేషం. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఆయన జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆ క్రమంలో ప్రాజెక్టులను పరిశీలిస్తూ ప్యాకేజీల వారీగా పనుల పురోగతి, సమస్యలు తదితర అంశాలకు సంబంధించి వివరాలు తీసుకున్నారు.

    సర్కిల్‌-1 పరిధిలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల వద్ద పనులను పర్యవేక్షించారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

    ప్రాజెక్టులను పరిశీలిస్తూ.. పనులు ఎక్కడివరకు వచ్చాయంటూ..!

    ప్రాజెక్టులను పరిశీలిస్తూ.. పనులు ఎక్కడివరకు వచ్చాయంటూ..!


    పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా వట్టెం జలాశయం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి బయలు దేరి వెళ్లి నార్లాపూర్‌ జలాశయం పనులను పర్యవేక్షించారు. అనంతరం ఏదుల జలాశయం పనులను పరిశీలించారు. వట్టెం జలాశయం వద్ద భూనిర్వాసితులతో మాట్లాడారు. ప్రాజెక్ట్ కింద ముంపు నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

    వట్టెం రిజర్వాయర్ పనులు స్పీడప్ చేయాలని ఆదేశాలు

    వట్టెం రిజర్వాయర్ పనులు స్పీడప్ చేయాలని ఆదేశాలు

    వట్టెం రిజర్వాయర్ పనులను స్పీడప్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కేసీఆర్. బిజినెపల్లి మండలం వట్టెం రిజర్వాయర్ పనులను హెలికాప్టర్ ద్వారా పరిశీలించిన కేసీఆర్.. దానికి సంబంధించిన పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఒకే షిఫ్టులో కొనసాగుతున్న పనుల్లో వేగం పెంచి మూడు షిఫ్టుల ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏదిఏమైనా మరో ఆరు నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా అధికారులతో పాటు సంబంధిత ఏజెన్సీలు కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

    భూసేకరణ కోసం నిధులు విడుదల చేస్తాం.. నిర్వాసితులకు అండగా ఉంటాం..!

    భూసేకరణ కోసం నిధులు విడుదల చేస్తాం.. నిర్వాసితులకు అండగా ఉంటాం..!

    ఇక ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయంలో నిధులను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఇంకా ఎక్కడైనా భూసేకరణ చేయాల్సి ఉన్న పక్షంలో వెంటనే అది కూడా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అయితే మధ్యలో ఆయన రైతులతో కూడా మాట్లాడారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చే రైతులకు మంచి ధర కల్పించాలని అన్నదాతలు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన సరేనంటూ ముంపు నిర్వాసితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+