ఎలా, ఏంచేద్దాం?: డిఎస్‌తో కెసిఆర్, ధర్మపురిలో మహేందర్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాజీ పీసీసీ అధ్యక్షులు డి శ్రీనివాస్‌ను బుధవారం నాడు ఆయన నివాసంలో కలిశారు. తెరాసలో చేరిన శ్రీనివాస్ సేవలను ఉపయోగించుకుంటామని కెసిఆర్ గతంలో హామీ ఇచ్చారు.
డిఎస్‌తో సమావేశమై తెలంగాణకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించనున్నట్టు గతంలో ప్రకటించిన విధంగా, కెసిఆర్ బుధవారం డిఎస్ నివాసానికి వెళ్లి చర్చించారు. బంగారు తెలంగాణ సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అంతా ఏకం కావాలని కెసిఆర్ కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తనను ఎంతో ఆదరించారని, తెలంగాణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో కారు ఎక్కుతున్నట్లు డిఎస్ చెప్పారు.

కెసిఆర్, డి శ్రీనివాస్
ఈ సందర్భంగా తన నివాసానికి వచ్చి కలసిన కెసిఆర్‌తో, తెలంగాణ అభివృద్ధిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక ప్రణాళికతో ముందుకెళ్లి తెలంగాణ సాధించుకున్నట్టుగానే, పద్ధతి ప్రకారం ముందుకెళ్తే బంగారు తెలంగాణ సాకారమవుతుందని వారు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.

కెసిఆర్-డి శ్రీనివాస్
ఏయే రంగాల్లో తెలంగాణ అభివృద్ధికి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రణాళిక? తదితర అంశాలపై డి శ్రీనివాస్‌తో కెసిఆర్ చర్చించారని తెలుస్తోంది.

మహేందర్ రెడ్డి
రవాణా శాఖా మంత్రి పి మహేందర్ రెడ్డి బుధవారం నాడు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మహేందర్ రెడ్డి
రవాణా శాఖా మంత్రి పి మహేందర్ రెడ్డి బుధవారం నాడు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications