• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెలబ్రెటీలతో సీఎం కేసీఆర్ చర్చలు - మద్దతుపై హామీ : కలిసొచ్చే పార్టీలపై క్లారిటీ..!!

|
Google Oneindia TeluguNews

జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కసరత్తు కొనసాగుతోంది. పక్కా వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. బీజేపీ రాజకీయలు.. వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. తన రాజకీయ ప్రయాణంలో కలిసొచ్చే పార్టీలు - ప్రముఖల తో కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు సైతం మద్దతు ప్రకటిస్తున్నారు. పార్టీ పేరు - రంగు - చిహ్నం విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రాధాన్యత పైన ఏ మాత్రం ప్రభావం పడకుండా వ్యవహరిస్తున్నారు.

బీజేపీ - కాంగ్రెస్ తో సమదూరం

బీజేపీ - కాంగ్రెస్ తో సమదూరం

అదే సమయంలో బీజేపీతో పోరాటం చేస్తూనే కాంగ్రెస్ తోనూ సమదూరం పాటిస్తున్నామనే సంకేతాలు స్పష్టం చేసే విషయంలో ఎక్కడా సందేహాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతీయ పార్టీ ప్రకటన పైన కసరత్తు పూర్తయిన తరువాత.. తన కార్యాచరణలో భాగంగా తొలి దశలో యువత, రైతులకు సంబంధించిన అంశాలపై ఉద్యమాల దిశగా ఆలోచన చేస్తున్నారు.

ఇందులో కలిసొచ్చే పార్టీలు.. ప్రముఖులతో మంతనాలు కొనసాగిస్తున్నారు. యువత అసంతృప్తిగా ఉన్న అంశాలపై ప్రశాంత్‌కిషోర్ బృందం.. ఒక నివేదిక సమర్పించినట్లు సమాచారం. .దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.

రైతులు - యువత అంశాలే లక్ష్యంగా

రైతులు - యువత అంశాలే లక్ష్యంగా

రైతుల విషయంలో కేంద్రం తీరు..నష్టం.. తీసుకోవాల్సిన చర్యల పైన మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ తన ముందున్న ప్రత్యామ్నాయ విధానాలను వివరించనున్నారు. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా సాధ్యమైన మేరకు ప్రజలకు దగ్గరయ్యేలా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రజల పెండింగ్ డిమాండ్లు..ఆకాంక్షలు.. పార్టీల వైఖరి పైనా కేసీఆర్ సమాచారం సేకరించారు.

వీటి పైన పూర్తి స్థాయిలో అధ్యయనం ద్వారా వారికి ఏ విధంగా మద్దతుగా నిలవగలమనే అంశం పైన ఫోకస్ చేస్తున్నారు. బీజేపీ తో పాటుగా కాంగ్రెస్ తో దూరంగా ఉంటున్న ప్రముఖులతో కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారు. సుబ్రమణ్య స్వామి.. టికాయత్ తోనూ ఇప్పటికే మంతనాలు జరిపారు. తాను గతంలో కలిసి కొన్ని పార్టీల నేతలు కాంగ్రెస్ తో సఖ్యతతో ఉంటున్న పరిస్థితుల్లో వారితోనూ ప్రస్తుతానికి దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

కలిసొచ్చే పార్టీలు.. ప్రముఖులతో మంతనాలు

కలిసొచ్చే పార్టీలు.. ప్రముఖులతో మంతనాలు

జేడీఎస్..ఆర్జేడీ..ఆప్..జేఎంఎం వంటి పార్టీలు తమతో కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. జాతీయపార్టీ ఆలోచన వెనక కారణాలను శ్రేణులద్వారా గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్, తమిళ హీరో విజయ్ వంటి వారితోనూ కేసీఆర్ ఇప్పటికే చర్చలు చేసారు. బీజేపీ అమలు చేస్తున్న విధానాల కారణంగా దేశానికి జరిగే నష్టం పైన మరింత ప్రజలకు వివరించాలని కోరారు. భారతీయ రాష్ట్ర సమితి పేరు పైనా పలు మార్గాల్లో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. తన పార్టీ విధి విధానాలు.. అజెండా గురించి ఈ నెల 21 లేదా 22న జరిగే పార్టీ విస్తృత స్థాయి భేటీలో పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు.

English summary
CM KCR met few important personalities and discussed his new party at national level. The main agenda was farmers and youth.జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కసరత్తు కొనసాగుతోంది. పక్కా వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. బీజేపీ రాజకీయలు.. వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X