వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రదాడిపై చర్చ: గవర్నర్‌తో కెసిఆర్ భేటీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం గంటన్నర పాటు సమావేశమైన వారిద్దరు నల్గొండ జిల్లాలో సిమి ఉగ్రవాదుల దాడి, ఆంధ్రప్రదేశ్ వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం రవాణా పన్ను విధింపు, హైకోర్టు విభజన తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

సిమి ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు పోలీసులు చనిపోవడం, పోలీసులు సాహసంగా ఎదిరించి ఉగ్రవాదులను మట్టుబెట్టిన తీరును ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు సిఎం ఆయనకు తెలిపారు. ఉగ్రవాదులను ధైర్యంగా ఎదిరించిన పోలీసులను గవర్నర్ ప్రశంసించినట్లు సమాచారం. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారని తెలిసింది.

గవర్నర్‌తో సిఎం కెసిఆర్

గవర్నర్‌తో సిఎం కెసిఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.

గవర్నర్‌తో సిఎం కెసిఆర్

గవర్నర్‌తో సిఎం కెసిఆర్

మధ్యాహ్నం గంటన్నర పాటు సమావేశమైన వారిద్దరు నల్గొండ జిల్లాలో సిమి ఉగ్రవాదుల దాడి, ఆంధ్రప్రదేశ్ వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం రవాణా పన్ను విధింపు, హైకోర్టు విభజన తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

సిఐ, ఎస్ఐలకు పరామర్శ

సిఐ, ఎస్ఐలకు పరామర్శ

ఉగ్రవాదులతో పోరాటంలో పోలీసులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు అభినందనీయమని కేంద్ర మంత్రులు ఎం వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ అన్నారు.

సిఐ, ఎస్ఐలకు పరామర్శ

సిఐ, ఎస్ఐలకు పరామర్శ

నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడి హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సీఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ సిద్దయ్యలను ఆదివారం కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పరామర్శించారు.

సిఐ, ఎస్ఐలకు పరామర్శ

సిఐ, ఎస్ఐలకు పరామర్శ

సీఐ, ఎస్సైలకు అందుతున్న వైద్యం గురించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు.

సిఐ, ఎస్సైలను పరామర్శించిన కేంద్రమంత్రులు

ఉగ్రవాదులతో పోరాటంలో పోలీసులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు అభినందనీయమని కేంద్ర మంత్రులు ఎం వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ అన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడి హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సీఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ సిద్దయ్యలను ఆదివారం వారు పరామర్శించారు. సీఐ, ఎస్సైలకు అందుతున్న వైద్యం గురించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు.

అనంతరం కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడే క్రమంలో కానిస్టేబుల్ నాగరాజు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జానకీపురం, సూర్యాపేటల్లో చోటుచేసుకున్న సంఘటనలు నిఘా వర్గాలకు పరీక్షగా భావించాల్సి ఉందన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Sunday met Governor ESL Narsimhan at Rajbhavan, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X