హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో మణిహారం. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు కొత్త మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసారు. ఇదే సమయంలో మెట్రో ప్రయాణీకులకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. మొత్తం 31 కిలోమీటర్ల మేర ఉండే రాయదుర్గం టు శంషాబాద్ రూట్‌లో రెండున్నర కిలోమీటర్లు భూగర్భ మార్గంలో అదే విధంగా..ఒక కిలోమీటరు రోడ్డుకు సమాంతరంగా మెట్రో వస్తుందన్నారు. ఎయిర్‌పోర్టులో రెండో రన్‌వే కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మొత్తం 31 కిలో మీటర్ల దూరం 26 నిమిషాల్లో చేరుకొనే విధంగా మెట్రో అందుబాటులోకి రానుంది.
న్యూయార్క్, లండన్, ప్యారిస్‌లో విద్యుత్ పోతుంది కానీ హైదరాబాద్‌లో మాత్రం పోనే పోదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. పవర్ గ్రిడ్‌తో నగరాన్ని అనుసంధనం చేశామని, పవర్ ఐలాండ్‌గా మార్చామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ కు సమాంతరంగా మెట్రో రావాల్సిన అవసరం ఉందన్నారు. మియాపూర్ నుంచి బీహెచ్ ఈఎల్ వరకు పొడిగిస్తామని ప్రకటించారు. ట్రాఫిక్ సమస్యకు ప్రధాన పరిష్కారం మెట్రోనే అని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎయిర్‌పోర్టులో రెండో రన్‌వే కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం.. వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీఎంఆర్ నిధులతో ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్ అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంటామన్నారు. హైదరాబాద్ చరిత్రలోనే కాదు వర్తమానంలోనూ గొప్ప నగరమన్నారు. హైదరాబాద్ సంస్కృతి మన సొంతమన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు. నగరంలో ఏ మూలకు వెళ్లినా మంచినీటి సమస్య ఉండేదన్నారు. గతంలో కరెంటు కోసం ధర్నాలు జరిగాయన్నారు. గొప్ప గొప్ప పరిశ్రమలు హైదరాబాద్‌లో కొలువుదీరుతున్నాయని, పరిశ్రమల రంగంలో ముందుకు దూసుకుపోతున్నామని చెప్పారు. అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ కష్టాలు తీరుతున్నాయని వివరించారు. ఆఫీస్ స్పేస్, రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు సడలించడంతో నిర్మాణం రంగం పుంజుకుందని చెప్పారు. ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని.. మెట్రో రైలు కనెక్టివీటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.












Click it and Unblock the Notifications