కొమురవెల్లి మల్లన్న సేవలో కెసిఆర్, దత్తన్న(పిక్చర్స్)
వరంగల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రెండు గంటల పాటు జరిగిన వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఆలయ సమీపంలో నిర్మించిన 56 గదులు కురుమ భవనాన్ని కెసిఆర్ ప్రారంభించారు.
స్వామి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరుపున పట్టుబట్టలు, ముత్యాల తలువాలు తీసుకువచ్చారు. ఆలయం వద్ద ఆయనకు ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, ఏఈవో వైరాగ్యం అంజయ్య, అర్చకులు మహాదేవుని గణేష్ తదితరులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ నుంచి మేళ, తాళాలు, కోలాటం, వేద పాఠశాల విద్యార్థుల శివకీర్తనలు, భజనల మధ్య కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు.
ఈ కల్యాణోత్సవ పర్యవేక్షణకు మహారాష్ట్ర లాతూర్ జిల్లా ఔసాలోని హరేమఠ్ సంస్థాన్ మఠాధిపతి షట్‌స్థల్ బ్రహ్మ శ్రీ శాంతవీర లింగ శివాచార్య స్వామిజీ హాజరయ్యారు. పురోహితులు నడిపుడి మఠం భవనయ్యస్వామి, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి, భువనేశ్వర్, జ్ఞానేశ్వర్‌తో పాటు ఆగమ పాఠశాల వేదపండితులు తంతు నిర్వహించారు.

మల్లన్న సేవలో..
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

మల్లన్న సేవలో..
రెండు గంటల పాటు జరిగిన వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మల్లన్న సేవలో..
స్వామి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరుపున పట్టుబట్టలు, ముత్యాల తలువాలు తీసుకువచ్చారు.

మల్లన్న సేవలో..
ఆలయం వద్ద ఆయనకు ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, ఏఈవో వైరాగ్యం అంజయ్య, అర్చకులు మహాదేవుని గణేష్ తదితరులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

మల్లన్న సేవలో..
అనంతరం కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందులాల్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ముందుకు సాగిన కేసీఆర్ వివాహ వేదికపై స్వామి, అమ్మవార్లకు పట్టుబట్టలు, తలువాలు సమర్పించారు.

మల్లన్న సేవలో..
స్వామి వారి కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు.

మల్లన్న సేవలో..
తొలుత స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ నుంచి మేళ, తాళాలు, కోలాటం, వేద పాఠశాల విద్యార్థుల శివకీర్తనలు, భజనల మధ్య కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు.

మల్లన్న సేవలో..
ఈ కల్యాణోత్సవ పర్యవేక్షణకు మహారాష్ట్ర లాతూర్ జిల్లా ఔసాలోని హరేమఠ్ సంస్థాన్ మఠాధిపతి షట్‌స్థల్ బ్రహ్మ శ్రీ శాంతవీర లింగ శివాచార్య స్వామిజీ హాజరయ్యారు.

మల్లన్న సేవలో..
పురోహితులు నడిపుడి మఠం భవనయ్యస్వామి, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి, భువనేశ్వర్, జ్ఞానేశ్వర్‌తో పాటు ఆగమ పాఠశాల వేదపండితులు తంతు నిర్వహించారు.

మల్లన్న సేవలో..
స్వామి వారి తరుపున పడిగన్నగారి వంశస్తులు, అమ్మవార్ల తరుపున మహదేవుని వంశస్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.

మల్లన్న సేవలో..
ఈ ఉత్సవంలో డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యతో పాటు ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆరూరి రమేశ్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.

మల్లన్న సేవలో..
అనంతరం ఆలయ సమీపంలో నిర్మించిన 56 గదులు కురుమ భవనాన్ని కెసిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

మల్లన్న సేవలో..
స్వామి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరుపున పట్టుబట్టలు, ముత్యాల తలువాలు తీసుకువచ్చారు.

మల్లన్న సేవలో..
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. కురుమ బిడ్డలు వ్యక్తిగత క్రమశిక్షణకు మారుపేరని, పొదుపు చేయడంలో నేర్పరులని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications