హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చండీయాగంలో రుత్విక్కుల మెనూ అదిరింది: ముద్ద పప్పు, అటుకుల పొంగళి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లోక కల్యాణం కోసం మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన అయుత మహా చండీయాగం రెండో రోజుకు చేరుకుంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన 1,500 రుత్విక్కులు ఈ చండీయాగంలో పాల్గొంటున్నారు.

అయితే చండీయాగం జరిగే సమయంలో రుత్విక్కులు ఎలాంటి భోజనం తీసుకుంటారనే దానిపై సామాన్య ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆయుత చండీయాగం చేసే సమయంలో రుత్విక్కులు ఎలాంటి నియమనిబంధనలు పాటిస్తారో ఒక్కసారి తెలుసుకుందాం. అయుత మహా చండీయాగానికి రుత్విక్కులే కీలకం.

Photos: కెసిఆర్ ఆయుత చండీయాగం

పరమ నిష్టాగరిష్టులైన పదిహేను వందల మంది పండితులు యాగ నిర్వహణలో పాల్గొంటున్నారు. చండీయాగం ప్రారంభం నుంచి పరిసమాప్తి వరకు ప్రతి ఒక్కరూ ఒకపూట మాత్రమే భోజనం చేస్తారు. యాగశాలలో మంచినీళ్లు కూడా ముట్టరు. రెండు పూటలా స్నానమాచరిస్తారు. దీక్షా వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. దీక్షాబద్ధులు యాగం జరిగే ప్రాంతాన్ని విడిచి వెళ్లరు.

CM KCR Performs Ayutha Chandi Yagam 2nd Day at Erravalli Village Live updates

రుత్విక్కుల భోజన వివరాలిలా ఉన్నాయి:

తొలిరోజు:
* ఉదయం అల్పాహారం: ఇడ్లీ, వడ, ఉప్మా
* మధ్యాహ్న భోజనం: అన్నం, చపాతి, ముద్దపప్పు, సాంబారు, పాతాలబాజీ (శనగపప్పు ఆకుకూర, బెల్లం), చల్ల పులుసు, బీన్స్ ఫ్రై, పూర్ణాలు, పులిహోర, అరటికాయ బజ్జీ, పెరుగు, పాపడ, రోటి పచ్చడి.
* రాత్రి అల్పాహారం : అటుకుల కిచిడి.

రెండో రోజు:
* ఉదయం అల్పాహారం : అటుకుల పొంగళి, చట్నీ.
* మధ్యాహ్న భోజనం : అన్నం, చపాతి, ఆకుకూర పప్పు, రసం, క్యాప్సికం కూర, సాంబారు, ఆలుబోండ, బాదుషా, పులిహోర, రోటి పచ్చడి.
* రాత్రి అల్పాహారం: పూరి, పన్నీర్ బటర్ మసాల, ఆలు కుర్మా.

మూడో రోజు:
* ఉదయం అల్పాహారం: అటుకుల పోని, చట్నీ, పెరుగు.
* మధ్యాహ్న భోజనం : అన్నం, చపాతి, పులిహోర, టమాటా పప్పు, పోని చల్ల, మసాల
* రాత్రి అల్పాహారం : బొంబాయి రవ్వ ఉప్మా, చట్నీ, పెరుగు.

నాలుగో రోజు:
* ఉదయం అల్పాహారం: ఇడ్లీ, వడ, సాంబారు, చట్నీ.
* మధ్యాహ్న భోజనం: అన్నం, చపాతి, పులిహోర, ఆకుకూర పప్పు, చల్ల పులుసు, పన్నీర్ బటర్ మసాల, దొండకాయ మసాల, సాంబారు, జిలేబీ, ఆలుబాత్, మిర్చీ రైతా.
* రాత్రి అల్పాహారం: అటుకుల దద్దోజనం.

చివరి రోజు:
* ఉదయం అల్పాహారం : ఉప్మా చుడువ.
* మధ్యాహ్న భోజనం: అన్నం, చపాతి, పులిహోర, ముద్దపప్పు, పోని చల్ల, బెండకాయ ఫ్రై, క్యాప్సికం కూర, మోతి చూరబూంది లడ్డూ, పాలకూర బజ్జీ, మెంతికూర పెసర పప్పు, సాంబారు, పెరుగు.
* రాత్రి అల్పాహారం: దద్దోజనం, మిరపబజ్జీ.

చండీయాగాన్ని వీక్షించేందుకు వస్తున్న భక్తులకు సైతం అక్కడే భోజన వసతిని ఏర్పాటు చేశారు. రోజూ సుమారు యాభైవేల మందికి భోజన వసతి కల్పిస్తున్నారు. ఇందు కోసం రోజూ 4 క్వింటాళ్ల బియ్యం, ఒక క్వింటా పప్పు, 6 వేల చపాతీలు, 5.25 క్వింటాళ్ల పెరుగును భోజనం కోసం అందిస్తున్నారు.

చండీయాగంలో ప్రత్యేక వంటల కోసం కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచే కూరగాయలు తరలిస్తున్నారు. మొత్తం మూడు వంటశాలలు ఏర్పాటు చేశారు. రుత్విక్కుల కోసం ఒకటి, వీఐపీలు, సాధారణ బ్రాహ్మణులకు మరోటి, భక్తుల కోసం వేరొక వంటశాలలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు.

రుత్విక్కుల వంటశాలలోకి ఇతరులకు ప్రవేశం లేదు. తయారు చేస్తున్న కూరల్లో 80 శాతం కూరగాయలను కేసీఆర్ ఫాంహౌస్ నుంచే కోసి నేరుగా తీసుకుని వస్తున్నారు. క్యాప్సికం, క్యాబేజీ, బెండకాయ, దొండకాయ, టమాటా, ఆలుగడ్డ, మెంతికూర, పచ్చిమిర్చి, పాలకూర తదితర కూరగాయలను ఫాంహౌస్ నుంచే తీసుకువస్తున్నారు.

English summary
CM KCR Performs Ayutha Chandi Yagam 2nd Day at Erravalli Village Live updates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X