మరో చారిత్రాత్మక నిర్ణయం దిశగా కేసీఆర్ - ప్రతిపక్షాలపై బ్రహ్మాస్త్రం : తుది కసరత్తు..!!
రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ.. సరి కొత్త నిర్ణయాలకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం. 2023 లో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ మరోసారి మందస్తు ఎన్నికలకు వెళ్తారనే అభిప్రాయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు బలంగా వినిపి స్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ రైతులకు సంబంధించి మేలు చేసే కొత్త నిర్ణయం పైన కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రైతుల కోసం కేసీఆర్ మరో నిర్ణయం
ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రైతులకు కేసీఆర్ రైతు బంధు అమలు చేస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే 50 వేల కోట్లను ఖర్చు చేసింది. రైతు భీమా ద్వారా.. మరణించిన రైతులకు రూ. 5 లక్షల బీమా వచ్చేలా ఇన్సూరెన్స్ చేస్తోంది. ఈ పథకంతో చాలావరకు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. రైతులకు పెట్టుబడి అందించే పేరుతో సంవత్సరానికి రెండు సార్లు అనగా వానాకాలం, యాసంగి పంటల సమయంలో రైతుబంధును అందిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘రైతుబంధు ద్వారా 64 లక్షల మంది రైతులకు నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లు అందించారు.

రైతులకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళికలు
రైతులు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవడానికి రైతు బీమాను ప్రవేశ పెట్టారు. ఈ పథకం ద్వారా రూ.3,205 కోట్ల ప్రీమియం చెల్లించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో రైతు సంక్షేమం కోసం రూ.2.71 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అప్పులలో కూరుకుపోయిన రైతులను అదుకోవడానికి రెండుసార్లు రైతులకు రుణమాఫీ చేశారు. దాదాపు లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. ఇదే సమయంలో రైతులకు పింఛన్ ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌లో సరికొత్త పథకానికి ప్రకటించేందుకు సీఎం సిద్ధం అవుతున్నట్లు భావిస్తున్నారు.
Recommended Video

మొదలైన కసరత్తు - రాజకీయంగా బ్రహ్మాస్త్రం
రైతుల పింఛన్‌పై సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. రైతులకు రూ.2వేలు ఇచ్చే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు పింఛన్ ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతులకు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. పోరాటం సమయంలో మరణించిన రైతులకు మూడు లక్షల చొప్పున సాయం అందిస్తామని చెప్పారు. ఇక, కేంద్రంతో రాజకీయంగా పోరాటం చేస్తూ.. రాష్ట్రంలో బీజేపీ - కాంగ్రెస్ ను ఎదుర్కొంటున్న కేసీఆర్ ఈ నిర్ణయం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా గ్రామీణ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications