అదే బుద్ది: రేవంత్‌పై సుమన్, గుడి బాగుంది.. దిల్ రాజుకు కెసిఆర్ ప్రశంస

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిల్ చేయడం తప్ప మరేది తెలియదని పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ శుక్రవారం నాడు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బానిస బుద్ధిని మానుకోవాలని హితవు పలికారు. ఎవరూ అడ్డుపడ్డా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.

నైలు నది నీటిని ఎన్ని దేశాలు పంచుకుంటున్నాయో రేవంత్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పమన్నారు. పాలమూరు జిల్లా పచ్చబడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు.

పాలమూరును వలసల జిల్లాగా మార్చిన పాపం టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుదే అన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు వ్యతిరేకంగా నాగం జనార్ధన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేయడం దారుణమన్నారు. పాలమూరు ఎత్తిపోతలను నాగం, రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

CM KCR praises Dil Raju for building Srivari Temple

జల విధానాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు విమర్శించడం సరికాదన్నారు. కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయాలన్నదే కెసిఆర్ స్వప్నం అని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదన్నారు. తమ తప్పులు బయటపడతాయనే కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభకు హాజరు కాలేదన్నారు.

దిల్ రాజుకు సీఎం కేసీఆర్ అభినందనలు

ఇందూరులో ఆలయాన్ని నిర్మించిన దిల్ రాజుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు తెలిపారు. శుక్రవారం జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో కెసిఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. అద్భుతమైన ఆలయాన్ని కరసేన ద్వారా నిర్మించిన గ్రామస్తులందర్నీ అభినందించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాలో ఈ ఆలయం ఉందన్నారు. గతంలో ఈ ఆలయానికి రాలేకపోయానన్నారు. ఇటువైపు వచ్చినప్పుడు ప్రతిసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తానన్నారు. ఆలయం అద్భుతంగా ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+