రాఖీ పండగ ప్రత్యేకతను వివరిస్తూ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనురాగ బంధానికి ప్రతీక ఈ పండుగని అన్నారు. కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని.. మానవ సంబంధాల్లో పరమార్థాన్ని ఇది తెలియజేస్తుందని చెప్పారు. రాఖీని రక్షాబంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదన్నారు కేసీఆర్.

భారతీయ సంస్కృతి, జీవనతాత్వికతకు ఇది వేదికగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. తోడబుట్టిన అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీపౌర్ణమి సందర్భంగా.. ప్రజలందరికీ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీని రక్షాబంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని కేసీఆర్ తెలిపారు.

cm kcr raksha bandhan wishes telugu women

అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలవాలని.. అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని కేసీఆర్ తెలిపారు. మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా.. తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు.. వృద్దులు తదితర రక్షణ అవసరమైన వర్గాలకు భరోసా అందిస్తున్నాయని కేసీఆర్ వివరించారు.

సంపదను సృష్టించి సకలజనులకు పంచుతూ ప్రగతి ప్రస్థానం కొనసాగుతున్నదన్నారు. ఇది రాష్ట్ర ప్రజల నడుమ సుహృద్భావ వాతావరణం, సహోదర భావాన్ని పెంచుతున్నదని కేసీఆర్ తెలిపారు. అనేక పథకాలను అమలు చేస్తూ.. మహిళలకు ప్రభుత్వం భరోసా అందిస్తూ, పెద్దన్నలా రక్షణగా నిలిచిందని అన్నారు. ఫలితంగా నేడు తెలంగాణలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ.. దేశానికే దిక్సూచిగా నిలిచారని పేర్కొన్నారు. రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలు, ఆనందోత్సహాలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

కాగా, రాఖీ పండుగ సందర్బంగా నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్.. ఉప్పల్, ఎల్బీనగర్​ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోయింది. రాఖీ పండుగ సందర్బంగా ఆర్టీసీ ఆగస్టు 29, 30, 31 తేదీల్లో 3,000ల ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది.

ఈ మూడు రోజుల్లో ప్రతి రోజూ వెయ్యి బస్సులను నడిపిస్తుంది. వీటితో పాటు ఈ నెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు లక్కీ డ్రా ఏర్పాటు చేసి రూ.5.50 లక్షల విలువ గల బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని ఆర్టీసీ సంస్థ కల్పించింది. మరోవైపు, సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఇక మిఠాయి దుకాణాలు, రాఖీ షాపులు ప్రజలతో సందడిగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+