మునుగోడు ఎన్నిక అప్పుడే : అభ్యర్ది - సర్వే రిపోర్టు పై కేసీఆర్ క్లారిటీ..!!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నిక పైన ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం చేసారు. కీలక అంశాలను పార్టీ నేతలకు వెల్లడించారు. టికెట్ పైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఉప ఎన్నికకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కేసీఆర్ సమీక్షించారు. ఉప ఎన్నికను ప్రోత్సహించిన బీజేపీ ఇప్పుడు భయపడుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దాని పైన ఆసక్తి కర అంశాలను షేర్ చేసుకున్నారు.

షెడ్యూల్ - ఎన్నికపై సీఎం అంచనా
పార్టీ శ్రేణులు ఐక్యంగా, నాయకులు వ్యక్తిగత రాగద్వేషాలు వదిలి టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక చండూరులో సభ నిర్వహిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూలు అక్టోబరులో రావచ్చని అంచనా వేస్తున్న ముఖ్యమంత్రి..నవంబరులో ఎన్నిక జరగవచ్చని పార్టీ నేతలకు సూచించారు.
ఎన్నిక ఎప్పుడు వచ్చినా నేతలంతా సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అభ్యర్ధి ఎవరనే అంశం పైన ముఖ్యమంత్రి ఓపెన్ గా ప్రకటన చేయలేదు. కానీ, సమావేశంలో జిల్లా మంత్రి..ఎమ్మెల్యేలతో పాటుగా టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు.

కూనుకుంట్లకే ఛాన్స్ దక్కుతుందంటూ
ముఖ్యమంత్రి సమీక్షలో ప్రస్తావించిన అంశాలు..సమీకరణాలతో పార్టీ నుంచి ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఖరారు అయ్యే అవకాశం ఉందనే అంచనాకు పార్టీ నేతలు వచ్చారు. అయితే,షెడ్యూల్ వచ్చిన తరువాతనే అధికారికంగా పార్టీ అభ్యర్ధిని ప్రకటించనున్నారు. ఇదే సమయంలో మునుగోడులో సర్వే ఫలితాలను ముఖ్యమంత్రి నేతలతో పంచుకున్నారు. అన్నీ సర్వేల్లో టీఆర్ఎస్ తొలి స్థానంలో ఉందని.. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉండగా, మూడో స్థానంలో బీజేపీ ఉందని చెప్పుకొచ్చారు.
ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక చండూరులో సభ నిర్వహిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. మునుగోడులోని నివాసం ఉంటున్న గిరిజనులను రోజుకో వెయ్యి మందిని హైదరాబాద్ తీసుకొచ్చి కొత్తగా నిర్మించిన ఆత్మగౌరవ భవనాలను చూపించాలని పార్టీ వర్గాలకు సూచించారు.

వారంలో గిరిజన రిజర్వేషన్ జీవో
గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ జీవో ఇవ్వనున్నామన్నారు. గిరిజన బంధునూ ప్రారంభించబోతున్నామన్నారు. వీటిపై గిరిజనుల ఇంటింటికీ తిరిగి గిరిజన బంధు గురించి వివరించాలని సూచించారు. దళితబంధుపై ఊరూరా ప్రచారం చేయాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు.
మునుగోడులోనూ 500 మందిని ఎంపిక చేయాలని సీఎం సూచించారు. గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ జీవో ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఎన్నిక కు ఇంకా సమయం ఉందనే విధంగా నేతలు ఉదాసీనంగా ఉండవద్దని..రేపే ఎన్నిక అనే విధంగా నేతలంతా సమిష్ఠిగా ఉప ఎన్నిక బాధ్యతలు నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications