బిసీ కమిషన్ ఏర్పాటుకు కెసిఆర్ ఆదేశం
వెనుకబడిన కులాల (బీసీ) అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బీసీలకు సంబంధించిన వ్యవహారాలను పరిశీలించి, ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ వేయాలని సూచించారు. త్వరలోనే క్యాబినెట్ సమావేశంలో బీసీ కమిషన్ ఏర్పాటుతోపాటు ఇతర అంశాలను చర్చిస్తామని ఆయన చెప్పారు. కమిషన్ ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బీసీల సంక్షే మం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications