ప్రధానమంత్రే శుత్రువయ్యారు! దుర్మార్గులను తరిమికొట్టాలి: బీజేపీ, మోడీపై కేసీఆర్

వికారాబాద్: కేంద్ర ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను మంగళవారం సాయంత్రం కేసీఆర్ ప్రారంభించారు. ఎన్నేపల్లిలో సమీకృత కలెక్టరేట్‌కు 34 ఎకరాల భూమి కేటాయించగా.. రూ. 60.70 కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తోపాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కాలే యాదయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభివాణిదేవి, తదితరులు పాల్గొన్నారు.

ఎవరో ఏదో చెప్పారని మోసపోవద్దంటూ కేసీఆర్

ఎవరో ఏదో చెప్పారని మోసపోవద్దంటూ కేసీఆర్

అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లా చేయాలని నిర్ణయించామని, వచ్చిన తర్వాత చేశామని చెప్పారు. వికారాబాద్ ప్రాంతానికి చరిత్ర ఉందని, అనంతగిరికొండలకు దేశ వ్యాప్తంగా పేరుందన్నారు. వికారాబాద్ కు మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ మంజూరైందని చెప్పారు. తెలంగాణ వస్తే ఇక్కడి భూముల ధరలు పడిపోయాన్నరని.. కానీ, తమ ప్రభుత్వ విధానాలతో రేట్లు పెరిగాయన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాల వాళ్లు వస్తుంటారని, ఏదో చెబుతారని.. వారు చెప్పేవి నమ్మవద్దని అన్నారు. మోసపోతే.. గోసపడతారని అన్నారు. ప్రజల పక్షాన నిలబడుతున్న టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలవాలని కోరారు.

రాష్ట్రమే కాదు, దేశం కూడా బాగుండాలంటూ కేసీఆర్

రాష్ట్రమే కాదు, దేశం కూడా బాగుండాలంటూ కేసీఆర్

అదే సమయంలో బీజేపీ, కేంద్రంపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. తాను వస్తుంటే కొందరు బీజేపీ జెండాలు పట్టుకుని అడ్డుపడ్డారని మండిపడ్డారు. వారు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. చావుదాక పోయి తెలంగాణ తెచ్చిన అని చెప్పారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో కొనసాగిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం కాదు, దేశం కూడా బాగుండాలన్నారు. కేసీఆర్ జిందాబాద్ అంటే సరిపోదని.. ఆలోచించాలన్నారు. ఎవరు చెప్పిన మాటలు నమ్మవద్దన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ కేసీఆర్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ కేసీఆర్

కేంద్రంలో ఉన్నవాళ్లు.. మనం ఇచ్చేవాటిని ఉచితాలు అని చెబుతున్నారన్నారు కేసీఆర్. ప్రజలు ఆలోచించాలన్నారు. వికారాబాద్ కు వస్తుంటే బీజేపీ వాళ్లు అడ్డుకున్నారన్నారు. మనం కొడితే వాళ్లు తుక్కు తుక్కు కారు? అంటూ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. దేశ ప్రధానిని కూడా అడిగా.. ఎనిమిదేళ్ల నుంచి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించినట్లు తెలిపారు. రైతుబంధు, రైతుబీమా ఇస్తే ఉచిత పథకాలు రద్దు చేయాలంటున్నారని అన్నారు. మీటర్లు పెట్టాలని, బిల్లులు వసూలు చేయాలని చెబుతున్నారని కేసీఆర్ తెలిపారు. బీజేపీ జెండాను చూసి మోసపోవద్దని అన్నారు. ఉచిత కరెంటు రావాలంటే జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగాయన్నారు. శావుకార్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. సింగరేణి బొగ్గు ఉన్నా.. ఇతర దేశాల్లో బొగ్గు కొనాలని చెబుతున్నారని అన్నారు. ఇందుకేనా బీజేపీ జెండాలు అడ్డుపెడుతున్నారని ప్రశ్నించారు.

మోడీ ప్రసంగంలో ఏంలేదు, కేంద్రంలో సర్కారు మారాలంటూ కేసీఆర్

పాలమూరు-రంగారెడ్డి పథకం ప్రాజెక్టు మొదలుపెట్టామని, కేంద్రం ఆపిందని కేసీఆర్ ఆరోపించారు. కృష్ణా నదిలో వాటా తేల్చలేదని బీజేపీపై మండిపడ్డారు. దీనిపై బీజేపీ నేతలు ఢిల్లీకి పోవాలన్నారు. వంద దరఖాస్తులిచ్చినా కృష్ణా నీళ్ల వాటా తేల్చలేదన్నారు. ప్రధానమంత్రే మనకు శత్రువయ్యారని అన్నారు. అయినా ప్రాజెక్టు కడతామని, నీళ్లు తెస్తామన్నారు. మోడీ ప్రసంగం నేను కూడా విన్న. ఎనిమిదేళ్లు ఏం చేయలే. ఏం చేస్తామని కూడా చెప్పలేదు. నెత్తికో రూమాలు కట్టి వేశం అంటూ కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం కూడా మంచి ప్రభుత్వం రావాలన్నారు. నిరుద్యోగం పెరుగుతోంది, రూపాయి విలువ పడిపోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టి మంచి ప్రభుత్వాన్ని తెచ్చేందుకు భాగస్వాములం కావాలన్నారు. ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఇలాంటి దుర్మార్గులను తరిమికొట్టాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+