ఆ విషయంలో ప్రధాని మోడీతో గొడవ పెట్టుకున్నా .. అసెంబ్లీలో కేంద్రాన్ని టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని వర్షాకాల శాసనసభ సమావేశాలలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ధ్వజమెత్తారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగో రోజున శాసనసభ, శాసనమండలి ఉభయసభల్లోనూ ఈరోజు ఉదయం 10 గంటల నుండి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాలలో సోమవారం దళిత బంధు పథకం, హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణ, ప్రపంచ వారసత్వ కట్టడం, హైదరాబాద్ నగరంలో దోమలు ఈగల బెడద, వంతెనల మంజూరు, ఐటీఐని షాద్ నగర్ కు మార్చడం వంటి అనేక అంశాలు చర్చిస్తున్నారు.

తెలంగాణా చారిత్రక కట్టడాలపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్

తెలంగాణా చారిత్రక కట్టడాలపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్

అయితే శాసన సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం పై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానమిచ్చారు. యునెస్కో గుర్తింపు కోసం విధించిన షరతుల విషయంలో ప్రభుత్వ కార్యాచరణను మంత్రి వెల్లడించారు. ఆపై తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ కట్టడాలపై మాట్లాడిన సీఎం కేసీఆర్ తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది అని మండిపడ్డారు.

కేంద్రం తీరుపై మోడీతో గొడవ పెట్టుకున్నానన్న కేసీఆర్

కేంద్రం తీరుపై మోడీతో గొడవ పెట్టుకున్నానన్న కేసీఆర్

ఇటీవల తన పర్యటనలో కూడా తెలంగాణ రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్న కేంద్రం తీరుపై ప్రధాని మోడీతో గొడవ పడ్డానని చెప్పారు. టూరిజంతో పాటుగా ఇతర విషయాల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. 58 సంవత్సరాలు సమైక్యాంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్భుత ప్రదేశాలకు ఎలాంటి ప్రచారం దక్కలేదని కేసీఆర్ పేర్కొన్నారు. అద్భుతమైన జలపాతాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొన్న కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం చాలా ఉజ్వలమైన సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు, గొప్ప కళలకు కేంద్రంగా ఉన్న ప్రాంతమని, కానీ కేంద్రం తెలంగాణను పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

పద్మశ్రీ అవార్డుల కోసం జాబితా పంపించాలా ? వద్దా మోడీని అడిగానన్న కేసీఆర్

పద్మశ్రీ అవార్డుల కోసం జాబితా పంపించాలా ? వద్దా మోడీని అడిగానన్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్రానికి అపారమైన సంపద ఉందని, పాండవులగుట్టను కేంద్రం పట్టించుకోవడం లేదని, వారసత్వంగా వచ్చిన పురాతన కోటలు, దోమకొండ కోట పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కళాకారులలో కూడా విశిష్టమైన వ్యక్తులు చాలామంది ఉన్నారని పేర్కొన్న కెసిఆర్, పద్మశ్రీ అవార్డుల కోసం జాబితాను పంపించాలా వద్దా అంటూ ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షా ని అడిగానని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలంపూర్ లోని జోగులాంబ ఆలయాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్డీఎస్ మీద అన్యాయాన్ని ప్రశ్నించడానికి జోగులాంబ నుంచి మొట్టమొదటిసారిగా పాదయాత్ర చేపట్టానని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

ఎమ్మెల్యేలతో కమిటీ వేసి చారిత్రక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పిస్తాం

ఎమ్మెల్యేలతో కమిటీ వేసి చారిత్రక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పిస్తాం


తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా, గోదావరి పుష్కరాల మీద కూడా గతంలో ఉద్యమం చేశానని పేర్కొన్న కేసీఆర్ అన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి చారిత్రక ప్రదేశాలు, కోటలు, దర్శనీయ స్థలాలు, విశిష్టతను సంతరించుకున్న ఆలయాలకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేంద్రాన్నిఎయిర్ స్ట్రిప్స్ ఇవ్వాలని అడిగి ఆరున్నర సంవత్సరాలు గడిచిపోయిందని, కానీ కేంద్రం కాలయాపన చేస్తోందంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టూరిజం, చారిత్రక కట్టడాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని కెసిఆర్ అసెంబ్లీ వేదికగా విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+