ఢిల్లీ కేంద్రంగా సీఎం కేసీఆర్ - కీలక అడుగులు..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా కీలక అడుగులు వేస్తున్నారు. నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండు రోజులు ఢిల్లీలో ఉండనున్నారు. బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ మారిన తరువాత సీఎం కేసీఆర్ తెలంగాణతో పాటుగా మొదటగా మహారాష్ట్ర పైన ఫోకస్ చేసారు. ఇప్పుడు జాతీయ రాజీకాయల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒకే తాటిపైకి రావాలని సాగుతున్న ప్రయత్నాల్లో కేసీఆర్ తో పలువురు ముఖ్య నేతలు భేటీ కానున్నట్లు సమాచారం.
ఢిల్లీలో రెండు రోజులు పర్యటన: దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు వసంత్ విహార్‌లోని బీఆర్ఎస్ ఆఫీసుకు సీఎం చేరుకోనున్నారు. హోమం, యాగం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ గంట పాటు సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ లో 2021 సెప్టెంబర్ లో భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కేంద్ర కార్యాలయాన్ని 11 వేల చదరపు అడుగుల స్థలంలో.. నాలుగు అంతస్తులతో నిర్మించారు.

కేంద్ర కార్యాలయం ప్రత్యేకతలు: పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ కార్యాలయంలో హోమం, యాగం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. కార్యాలయంలో లోయర్ గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్‌లు సిద్దం చేసారు. మొదటి అంతస్తులో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు అయ్యాయి. 2, 3వ అంతస్తుల్లో మొత్తం 20 రూములు నిర్మించారు. వీటిలో ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉండనున్నాయి. తెలంగాణ ఎన్నికలకు సిద్దం అవుతూనే జాతీయ రాజకీయాలపైన కేసీఆర్ ఫోకస్ చేయన్నారు. ప్రారంభోత్సవం తరువాత పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.

జాతీయ నేతలతో సమావేశాలు: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర పైన ఈ రెండు రోజుల పర్యటన కీలకం కానుంది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉమ్మడి పోరాటం చేయాలని భావిస్తున్నాయి. ఇందుకోసం కొద్ది రోజుల క్రితం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా, కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్దంగా లేని పార్టీల పైన రాహుల్ గాంధీతో నితీష్ భేటీ లో చర్చింది. అందులో భాగంగా మమతా, కేసీఆర్, కేజ్రీవాల్ తో సంప్రదింపుల బాధ్యతలను నితీష్ స్వీకరించారు. కేసీఆర్ తో చర్చలు చేస్తారని ప్రకటించారు. ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు జరిగే అవకాశ ఉంది. నితీష్ ఇప్పుడు ఢిల్లీలో కేసీఆర్ తో సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో మరి కొందరు ముఖ్యులు సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications