Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతులు, మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నారు. వార్ ఒన్ సైడ్ చేయాలని లక్ష్యంతో ఉన్నారు. హ్యాట్రిక్ విజయం దిశగా వ్యూహాల అమలు చేస్తున్నారు. సెంటిమెంట్ ను కొనసాగిస్తూ హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. హుస్నాబాద్ లోనే పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను మించి..రైతులు..మహిళలు..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల వరాల ప్రకటనకు సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు.

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ : ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా మెజార్టీ ఓట్ బ్యాంక్ తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా ఎన్నికల వరాల ప్రకటనకు సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు. ప్రధానంగా రైతులు..మహిళలు..బీసీలు, మైనారిటీ, మధ్య తరగతి వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా మేనిఫెస్టో ఉండనున్నట్లు తెలుస్తోంది.

CM KCR to Release BR Election Manifesto in Husnabad public meeting on 15th October

సీనియర్‌ సిటిజన్లకు భద్రత కల్పించేలా మేనిఫెస్టో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను చూసే పథకాలను ప్రకటించబోతున్నామని, సంక్షోభం వచ్చినా సంక్షేమం ఆగకూడదన్న లక్ష్యంగా ముందుకెళ్లే విధంగా ప్రభుత్వ ఆదాయ - వ్యయాలను వివరిస్తూ ప్రజల్లో ఆలోచన కలిగించేలా తన ప్రణాళికా అమలు దిశగా కేసీఆర్ సభల్లో ప్రసంగాలకు సిద్దం అవుతున్నారు.

సెంటిమెంట్ కొనసాగిస్తూ : ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింత పెంచడంతోపాటు కొత్తగా నాలుగదు స్కీముల ప్రకటనకు కసరత్తు కొనసాగుతోందని సమాచారం. వృద్ధాప్య, వితంతు పింఛన్లను మరో రూ.1000 పెంచే అవకాశం ఉంది. రైతు పింఛన్‌, మహిళలకు మహిళా పింఛన్‌, గ్యాస్‌ సబ్సిడీ పెంచే దిశగా ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

రైతుబంధు సాయం ఎకరానికి మరో రూ.1000 పెంచడంతోపాటు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని రూ.1.25లక్షలకు పెంపు పైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర పన్ను వాటా వ్యాట్‌ను కొంత సడలించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుదల, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పెంపుదల తదితర అనేక పథకాలు ఉన్నట్లు తెలిసింది.

CM KCR to Release BR Election Manifesto in Husnabad public meeting on 15th October

ఎన్నికల వరాలు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 15న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2014 ,2018 రెండుసార్లు హుస్నాబాద్ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని బహిరంగ సభ ద్వారా ప్రారంభించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. ఇదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ మూడోసారి హ్యాట్రిక్ లక్ష్యంతో ఇక్కడ నుంచే ఈ సారి కూడా ప్రచారం ప్రారంభిస్తున్నారు.

ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగిస్తూనే..మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. యువత, గృహిణులు, ఒంటరి మహిళల కోసం ప్రత్యేక పథకాలు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. దీంతో, కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టోపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+