రేపు యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయాన్ని సందర్శించనున్న సీఎం కేసీఆర్...

ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం(సెప్టెంబర్ 14) యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ అభివృద్ధి ప‌నుల‌ను సీఎం ప‌రిశీలించ‌నున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ మాసాల్లో యాదాద్రి పుణ్య‌క్షేత్రం ప్రారంభోత్స‌వం జరిగే అవ‌కాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయనేది సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఇటీవ‌లి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం కేసీఆర్... యాదాద్రి ఆల‌య ప్రారంభోత్స‌వానికి ఆయన్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణాలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా భక్తులు పుణ్య స్నానమాచరించేందుకు కొండ కింద గండిచెరువు పక్కనే పుష్కరిణి నిర్మాణం పూర్తయింది. 43 మీటర్ల పొడవు, 16.50 మీటర్ల వెడల్పు, 4ఫీట్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఇటీవలే ఇందులో నీటిని విడుదల చేసి ట్రయల్ రన్ కూడా చేపట్టారు.మోటార్ల సాయంతో 2 ఫీట్ల మేర నీటిని నింపి పరీక్షించారు.

cm kcr to visit yadadri laxmi narasimha swamy temple tomorrow

కొండపై నిర్మాణ పనులు ఇప్పటికే ఓ కొలిక్కి రాగా.... గుట్ట దిగువున కొన్ని ప్రధాన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.ఆలయాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంలో సీఎం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. రేపటి యాదాద్రి పర్యటన తర్వాత సీఎం కేసీఆర్... చినజీయర్ స్వామితో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.

సీఎంఓ ముఖ్య కార్య‌ద‌ర్శి భూపాల్ రెడ్డి ఇటీవలే యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన ఆలయం లిప్టు, రథశాల, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. శ్రీవారి మెట్లు, శివాలయం, ప్రధానాలయం తుది మెరుగుల పనులను పరిశీలించి పనుల తీరుపై వైటీడీఏ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లిప్టు, రథశాలకు మరింతగా మెరుగులు దిద్దాలని సూచించారు. ప్రసాద విక్రయ శాల వద్ద నిర్మించే ర్యాంపు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ దర్వాజలకు ఇత్తడి తొడుగులు బిగింపు ప్రక్రియను పరిశీలించారు.

లక్ష్మీ నరసింహస్వామి ఖజానా ఆదాయం :

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 10,09,797 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో గీత వెల్లడించారు. ప్రధాన బుకింగ్‌లతో రూ. 1,44,878, రూ. 100 దర్శనంతో రూ. 16,000, వీఐపీ దర్శనాలతో రూ. 90,000, వేద ఆశీర్వచనంతో రూ. 12,384, క్యారీబ్యాగుల విక్రయాలతో రూ. 5,000, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 48,500, కల్యాణకట్టతో రూ. 24,440, ప్రసాద విక్రయంతో రూ. 4,22,335,
శాశ్వత పూజల ద్వారా రూ. 38,232, వాహన పూజలతో రూ. 8,500, టోల్‌గేట్‌తో రూ. 850, అన్నదాన విరాళంతో రూ. 27,813, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 96,300, యాదరుషి నిలయంతో రూ. 55,650, పాతగుట్టతో రూ. 18,315 తో కలుపుకుని రూ. 10,09,797 ఆదాయం వచ్చినట్లు ఆమె తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+