పొలాల్లో పరామర్శ - వాహనంలో భోజనం : పరిహారంపై సీఎం కేసీఆర్ ప్రకటన..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ పొలంబాట పట్టారు. వడగళ్ల వానతో పంటనష్ట పోయిన రైతులకు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎకరానికి 10 వేల సాయం అందిస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో హెలికాప్టర్ పొలాలు పరిశీలించిన ముఖ్యమంత్రి..నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులను పరామర్శించారు. మంత్రులు..సీఎంఓ సిబ్బందితో కలిసి వాహనంలో ముఖ్యమంత్రి తన వాహనంలోనే భోజనం చేసారు. మంత్రి ఎర్రబెళ్లి దయాకర్ రావు స్వయంగా సీఎంకు భోజనం వడ్డించారు. పంట కోల్పోయిన రైతులు నిరాశ పడవద్దు.. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టం జరిగిన జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతలో సీఎం పర్యటించారు. దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్‌ నుంచే పరిశీలించారు. అనంతరం గార్లపాడు మార్గంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. రావినూతల శివారులోని మొక్కజొన్న రైతులతో పంట నష్టంపై స్వయంగా వాకబు చేసారు. పెట్టుబడి..నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కౌలు రైతులకు పరిహారం అందే విధంగా ఆదేశాలు ఇస్తున్నామన్నారు. అన్ని పంటలకు పదివేల పరిహారం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

CM KCR Visits hailstorms and unseasonal rains affected areas, have lunch in bus along with officials

పంటపొలాల్లో పరిశీలన తరువాత ముఖ్యమంత్రి తాను ప్రయాణించే వాహనంలోనే భోజనం చేసారు. మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందితో కలిసి రోడ్డు పక్కన ఆపిన బస్సులో లంచ్ ముగించారు. మంత్రి దయాకర్ రావు స్వయంగా సీఎంకు వడ్డన చేసారు. ముఖ్యమంత్రి పొలం గట్టున పరామర్శలు..బస్సులో భోజనం వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇదే పర్యటనలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2 లక్షల 28 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. పరిహారం కోసం మొత్తం రూ. 228 కోట్లు విడుదల చేస్తన్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో మరిన్ని కీలక అంశాలను సీఎం చెప్పుకొచ్చారు. పంట నష్టంపై కేంద్రానికి ఎలాంటి నివేదికా పంపడం లేదని స్పష్టం చేసారు.

కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పైన కేసీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశానికి కొత్త అగ్రికల్చర్ పాలసీ అవసరం ఉందన్నారు. గతంలో నష్టాలపైన కేంద్రానికి నివేదికలు పంపినా..పైసా సాయం చేయలేదని గుర్తు చేసారు. తెలంగాణ లో 56 లక్షల ఎకరాలు వరి ఉందన్నారు. పంట కోల్పోయిన రైతులు నిరాశ పడవద్దని ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ లు సరిగా లేవని ధ్వజమెత్తారు. ఇపుడు ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఏమి చెప్పినా వృథాగా పేర్కొన్నారు. వరంగల్..కరీం నగర్ జిల్లాల్లోనూ నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+