Palamuru-RangaReddy: నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న సీఎం కేసీఆర్..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గటంలకు కేసీఆర్ రోడ్డు మార్గం గుండా నాగర్ కర్నూలు వెళ్తారు. మధ్యాహ్నం నాగర్ కర్నూల్ లోని తేజ గార్డెన్స్ కు చేరుకుంటారు. అక్కడ భోజనం చేస్తారు. మధ్యహ్నం 2 గంటల 30 నిమిషాలుక నార్లాపూర్ రిజర్వాయర్ సమీపంలోని కంట్రోల్ రూమ్ చేరుకుంటారు. అక్కడ కాసేపు రిజర్వాయన్ సందర్శిస్తారు.

మధ్యాహ్నం 3:30 గంటలకు మోటారును స్విచ్​ఆన్​చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. 4 గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ ​వద్దకు చేరుకుని కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 4:45 గంటలకు కొల్లాపూర్​ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని.. సాయంత్రం 5 గంటలకు కొల్లాపూర్​ లోని సింగోటం చౌరస్తాలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

CM KCR will launch the Palamuru-Ranga Reddy project today

సభ ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు. శ్రీశైలం ఫోర్​షోర్ ​నుంచి 1.22 కిలోమీటర్ల వరకు అప్రోచ్​ కెనల్​ ద్వారా ఎల్లూరు పంపు హౌస్ ​హెడ్​రెగ్యులేటర్ ​కు నీళ్లు చేరుతాయి. అక్కడి నుంచి సర్జ్​ పూల్​లోకి నీళ్లు రానున్నాయి. శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా కృష్ణా నది నుంచి కోతిగుండు ద్వారా నీటిని తీసుకునేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించారు. అరవై రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు వీలుగా అయిదు ఎత్తిపోతలు, ఆరు జలాశయాలను నిర్మించారు.

దీనిలో భాగంగా తొలి పంపుహౌసులో మొదటి పంపును సిద్ధం చేశారు. భూగర్భంలో పంపుహౌస్‌ ఏర్పాటు చేయగా ఉపరితలంపై ఏర్పాటు చేసిన కంట్రోలింగ్‌ కేంద్రం నుంచి పంపును మీట నొక్కి నీటి ఎత్తిపోతను సీఎం ప్రారంభించనున్నారు. 145 మెగావాట్ల కెపాసిటీ గల మోటారును స్విచ్​ ఆన్ ​చేసి, 104 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్​ చేసి నార్లాపూర్​ రిజర్వాయర్​లో పోస్తారు. ఈ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసే నీళ్లతో ఉమ్మడి మహబూబ్ ​నగర్​ జిల్లాలోని ప్రతి ఊర్లో గ్రామ దేవతలకు 17న జలాభిషేకం చేయనున్నారు.

సీఎం బహిరంగ సభకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం లాగానే పాలమూరు రంగారెడ్డి తెలంగాణకు గుదిబండాలా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతలు కాబట్టి ప్రాజెక్టు నిర్వహణ వ్యయం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+