ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి భారీ కానుక - ఖాతాల్లోకి బకాయిలు..!!

సంక్రాంతి వేళ ఉద్యోగులకు సీఎం రేవంత్ తీపి కబురు అందించారు. సుదీర్ఘ కాలంగా ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వినతులకు సానుకూలంగా స్పందించారు. ఉద్యోగులు చాలా రోజులు గా పెండింగ్ డీఏలతో పాటుగా బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. దీని పైన ప్రభుత్వంతోనూ చర్చలు చేసారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతీ నెలా కొంత మేర బకాయిలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. కాగా, ఇప్పుడు సంక్రాంతి వేళ ఉద్యోగులకు ఒక డీఏ విడుదల చేస్తూ సీఎం రేవంత్ సంతకం చేసారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. ఉద్యోగులకు ఒక డీఏ విడుదల చేస్తున్నట్లు వెల్లడిం చారు. 3.64 శాతం మేర ఈ డీఏ విడుదల కానుంది. పెంచిన డీఏను 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం పైన రూ 227 కోట్ల భారం పడనుందని వివరించారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 5.14 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు భరోసా లభిస్తుంది. రాష్ట్రంలోని రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వివరించారు. ఉద్యోగుల బకాయిలను సైతం త్వరలో పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పదవీ విరమణ ప్రయోజనాలను సాధ్యమైనంత త్వరగా అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

cm-revanth-announces-da-for-employees-as-sankranti-gift-details-here

ప్రతీ నెలా వెయ్యి మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారని చెప్పారు. నిర్ణయాలు చేసేది తామే అయినా.. ప్రభుత్వానికి సారధులు మాత్రం ఉద్యోగులేనని స్పష్టం చేసారు. అప్పటి ప్రభుత్వం మీ పై ఒత్తిడి పెట్టి నిర్ణయాలు అమల చేసిందని చెప్పారు. శుక్రాచార్యుడు ఫాం హౌస్ లో ఉంటే.. మారీచులు అసెంబ్లీకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగుల హక్కుగా పేర్కొన్న రేవంత్.. ప్రభుత్వం - ఉద్యోగులు వేర్వేరు కాదని చెప్పారు. పన్నులు పెంచ టం లేదు కానీ, ఆదాయం తగ్గిపోతోందని వివరించారు. నియోజకవర్గల పునర్విభజన తరహాలోనే జిల్లాల పునర్విభజన కమిషన్ వేస్తామని రేవంత్ ప్రకటించారు. సికింద్రాబాద్ పేరు ఎక్కడ తీసేసా మని ప్రశ్నించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే జిల్లాల పునర్వి భజన పైన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10 నుంచి 15 శాతం కట్ చేస్తామని ప్రకటించారు. కట్ చేసిన ఆ డబ్బును తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని.. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు తీసుకొస్తామని రేవంత్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+