రేవంత్ సలహాదారుగా నరేందర్ రెడ్డి- మరో ముగ్గురికి కీలక హోదా..!!
తెలంగాణ ప్రభుత్వం సలహాదారులను నియమించింది. ముఖ్యమంత్రి సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ ను నియమించారు. మల్లురవికి ఢిల్లీ కీలక హోదా కేటాయించారు. ఈ నెలాఖరులోగా మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీ పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. పిసీసీ చీఫ్ గా ఉన్న సమయం నుంచి తనకు అండగా నిలిచిన వారికి రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారు.
రేవంత్ సలహాదారులుగా: తెలంగాణలో కీలక పదవుల నియామకంపై సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరికి తాజాగా ఎమ్మెల్సీ పదవులు కేటాయించారు. ఇప్పుడు సలహాదారుల పదవులు ఖరారు చేసారు. రేవంత్ సన్నిహితుడు వేం నరేంద్ రెడ్డికి ముఖ్యమంత్రి సలహాదారు హోదా కేటాయించారు. నరేందర్ సీఎం వ్యవహారాలను కేబినెట్ హోదాలో నిర్వహిస్తారు. పార్టీలో సీనియర్ మైనార్టీ నేత షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహదారు హోదాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖలు అప్పగించారు.

కేబినెట్ లో మైనార్టీ మంత్రి లేకపోవటంతో షబ్బీర్ అలీకి సలహదారు హోదాలో ఈ బధ్యాతలను ఖరారు చేసారు. హర్కర వేణుగోపాల్ కు ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ అప్పగిస్తూ ప్రభుత్వ సలహదారుగా నియమించారు. రేవంత్ కు తొలి నుంచి మద్దతుగా నిలిచిన మల్లు రవికి ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు, గతంలోనూ మల్లు రవి ఇదే హోదాలో పని చేసారు.
నలుగురికి బాధ్యతలు: ముఖ్యమంత్రి రేవంత్ వేం నరేందర్‌కు దాదాపు 16 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. టీడీపీలోనూ ఇద్దరూ కలిసే ఉన్నారు. 2004-2009 మధ్యలో వేం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా రేవంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతలిద్దరి మధ్య స్నేహబంధం బలపడింది. 2009లో నియోజకవర్గాల పునర్ విభజనతో వేంనరేందర్ నిర్మించుకున్న రాజకీయదుర్గం మహబూబాబాద్ రిజర్వ్‌డ్ అయిపోయింది.
రేవంత్ వ్యవహారాల్లో కీలకంగా: వేం నరేందర్ ను 2015లో ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్‌సన్ వద్దకు రేవంత్ వెళ్లారు. అనంతర కాలంలో రేవంత్ ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లలో నరేందర్ తన వెన్నంటే ఉన్నారు. తర్వాత ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్‌లో చేరారు.
నామినేటెడ్ పోస్టులపై కసరత్తు: రేవంత్ కు కాంగ్రెస్ కు వచ్చిన సమయం నుంచీ నరేందర్ కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల సమయంలోనూ పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి నిర్వహించే కార్యక్రమాలు అన్నింటినీ వెనుక నుంచి వేంనరేందరే పర్యవేక్షించే వారు. తన ప్రభుత్వంలో నరేందర్‌కు ఇప్పుడు సీఎం సలహాదారు పదవి కట్టబెట్టారు.
అదే విధంగా షబ్బీర్ అలీ, వేణుగోపాల్, మల్లు రవికి ప్రాధాన్యత ఇచ్చారు. మరో నేత మండవ వెంకటేశ్వరరావు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నియమాకం పైన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా మరి కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications