సాహస బాలుడిని సన్మానించిన సీఎం రేవంత్
అగ్రి ప్రమాద్రం సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆరుగురు ప్రాణాలను కాపాడి రియల్ హీరో అయిన సాయి చరణ్ పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నందిగామలో అలెన్ హోమియో అండ్ హెర్బల్స్ ఫార్మా కంపెనీలో ఏప్రిల్ 26న భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికులను పదో తరగతి బాలుడు సాయిచరణ్ కాపాడాడు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆ బాలుడిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం రేవంత్ రెడ్డి శాలువా కప్పి అతడిని అభినందించారు. జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు ప్రాణాలు కాపాడిని సాయిచరణ్ అనే బాలుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

కాగా, పొగ, చిన్న చిన్నగా మంటలు రావడం గమనించి ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన 17 ఏళ్ల సాయిచరణ్.. అగ్నిప్రమాద తీవ్రతను పసిగట్టి భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. కిటీకి ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయచరణ్ సాయం చేశాడు. ఆరుగురు కార్మికులను కాపాడాడు.
మరికొంత మందిని అప్రమత్తం చేశాడు.
స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సైతం సాయి చరణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విషయం తెలుసుకున్న సీఎం రేంత్ రెడ్డి.. ఆదివారం తన కార్యాలయానికి పిలిచి ఎమ్మెల్యే సమక్షంలో సాయిచరణ్‌ను అభినందించి సత్కరించారు. 'సాహసం చేశావ్ రా బుడతా' అంటూ ప్రశంసించారు సీఎం రేవంత్.












Click it and Unblock the Notifications