సీఎం రేవంత్ మాస్టర్ స్కెచ్..!!
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైదరాబాద్ నగరంలో మాత్రం మెజారిటీ సీట్లను భారత రాష్ట్ర సమితి గెలుచుకుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. సెటిలర్లంతా బీఆర్ఎస్ కే ఓటు వేయడం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సెటిలర్స్‌లో కొంతకాలం పాటు ఒక్కింత భయం వెంటాడింది. తమ వ్యాపారాలపై ప్రభావం ఏమైనా పడుతుందేమో అన్న భయంతో వారంతా 2018,2023లో బీఆర్ఎస్‌కే ఓటు వేసినట్లు తెలుస్తోంది.
అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదును బీఆర్ఎస్ స్వీప్ చేసినప్పటికీ.. రాష్ట్రంలో మాత్రం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అవడంతో హైదరాబాదులోని సెటిలర్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి ఉండగా మనకేంటి భయం అనే భావనలోకి వచ్చేశారు. ఆ భరోసాతోనే నిశ్చింతగా ఉన్నారు.

ఎంత పని జరిగిందబ్బా
రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సెటిలర్లంతా నాడు ఓటు వేయకుండా పెద్ద తప్పే చేశామనే ఫీలింగ్‌లో ఉండిపోయారు.దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ మాత్రం మొహమాటం లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగే ఎన్నికల్లో సెటిలర్లంతా ఓట్లేస్తారా? లేదా? అనే చిన్న సందేహం, అనుమానం రేవంత్ రెడ్డిలో ఉందని తెలుస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా 2007లో హైదరాబాద్ పరిధిని ఎలాగైతే పెంచారో, ఇప్పుడు కూడా అలాగే పెంచుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల, దానికి సమీపంలోని 27 పురపాలక సంఘాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రానున్నాయి. దీనిపై మంత్రివర్గం కూడా ఆమోదముద్ర వేసింది. 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాలు, 6 లోక్ సభ స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతి పెద్ద నగరంగా హైదరాబాద్ మారబోతోంది.
పట్టు పెంచుకొని పునాది వేసుకోవడం కోసం
ఇప్పడు విలీనమయ్యే ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు పెంచుకోవడంద్వారా ఒకవేళ ఇప్పటివరకు ఉన్న నగర పరిధిలో ఓట్లు తక్కువ పడినా, ఆ ప్రాంతాలద్వారా సమం చేసుకోవాలని భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారీటీ సీట్లు గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్ ముందుగా గ్రేటర్ ను కైవసం చేసుకొని ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పట్టు పెంచుకోవడానికి ప్రణాళిక రచిస్తోంది.ఇందులో భాగంగానే 27 పురపాలక సంఘాలను కలిపేస్తూ, దేశంలో పెద్ద నగరంగా మారుస్తున్నారు.












Click it and Unblock the Notifications