మిత్రుడుకు రేవంత్ సలహాదారు హోదా - టీడీపీ మాజీలకు కీలక పదవులు..!!
తెలంగాణలో కీలక పదవుల నియామకంపై సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరికి తాజాగా ఎమ్మెల్సీ పదవులు కేటాయించారు. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు పదవితో పాటుగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీలో గతంలో పని చేసి తరువాత రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ లోకి వచ్చిన వేం నరేందర్ రెడ్డి, మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వర రావుకు ఈ పదవులు ఖాయమైనట్లు సమాచారం.
సలహాదారుగా నరేందర్ రెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలో మరో రెండు కీలక పదవుల భర్తీకి నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి కీలక పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. అందులో భాగంగా నరేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

రేవంత్‌తో నరేందర్‌కు దాదాపు 16 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. టీడీపీలోనూ ఇద్దరూ కలిసే ఉన్నారు. 2004-2009 మధ్యలో వేం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా రేవంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతలిద్దరి మధ్య స్నేహబంధం బలపడింది. 2009లో నియోజకవర్గాల పునర్ విభజనతో వేంనరేందర్ నిర్మించుకున్న రాజకీయదుర్గం మహబూబాబాద్ రిజర్వ్‌డ్ అయిపోయింది.
రేవంత్ వ్యవహారాల్లో కీలకంగా: వేం నరేందర్ ను 2015లో ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్‌సన్ వద్దకు రేవంత్ వెళ్లారు. అనంతర కాలంలో రేవంత్ ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లలో నరేందర్ తన వెన్నంటే ఉన్నారు. తర్వాత ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచీ పలు కార్యక్రమాల్లో నరేందర్ కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల సమయంలోనూ పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి నిర్వహించే కార్యక్రమాలు అన్నింటినీ వెనుక నుంచి వేంనరేందరే పర్యవేక్షించే వారు. తన ప్రభుత్వంలో నరేందర్‌కు కీలక పదవిని ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలనే దిశగా కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది. క్యాబినెట్ హోదాతో ఈ పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం.

మండవకు కీలక పదవి: ఇదే సమయంలో టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన మాజీ మంత్రి..సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావుకు కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవిని ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడికి క్యాబినెట్ హోదా ఉంటుంది.
ఆ హోదాతో ఆయన్ను మంత్రివర్గ సమావేశాలకు ఆహ్వానించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలకు కీలక పదవులు ఇవ్వటం ద్వారా ఇక రేవంత్ పాలనలో కీలకంగా మారనున్నారు. పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేలా ఈ ఇద్దరికి ఏరి కోరి ఈ పదవులకు ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. వీరి నియామకానికి సంబంధించి అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications