Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జిల్లాల పునర్విభజన పై రేవంత్ కీలక ప్రకటన, కొత్తగా ఇక..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన పైన చర్చ జరుగుతోంది. ఏ జిల్లా సరిహద్దులు మారుతాయి.. కొత్తగా ఎక్కడ జిల్లా ఏర్పాటవుతుందనే అంచనాలు మొదలయ్యాయి. జిల్లాల పునర్విభజన ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ఇప్పుడు సీఎం రేవంత్ ఇదే విషయం పైన స్పష్టత ఇచ్చారు. తమ కార్యాచరణ పైన క్లారిటీ ఇవ్వటంతో పాటుగా... ఏ విధంగా ముందకు వెళ్లేదీ తేల్చి చెప్పారు. దీంతో.. జిల్లాల పునర్విభజన పైన ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ జిల్లాల పునర్విభజన పైన స్పష్టత ఇచ్చారు. గతంలో పద్దతి లేకుండా జిల్లాలను పునర్విభజన చేసారని చెప్పుకొచ్చారు. జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ విషయంలో పలు విజ్ఞప్తులు, డిమాండ్స్ వచ్చాయని వివరించారు. గతంలో జిల్లాలు, మండలాలను ఇష్టం వచ్చినట్లుగా విభజించారని విమర్శించారు. జిల్లాలు, మండలాల పునర్ వ్యవస్థీకరణకు త్వరలోనే రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జితో ఒక కమిషన్ ను నియమిస్తామని రేవంత్ ప్రకటించారు. ఈ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ విషయంలో ప్రజల సూచన లు, సలహాలు తీసుకుంటుందని చెప్పారు. బడ్జెట్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలతో కూలంకషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు డిమాండ్లు పెరిగాయని రేవంత్ చెప్పుకొచ్చారు.

cm-revanth-made-crucial-announcement-over-districts-and-mandals-re-organization

దీంతో, ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య ఒకటి నుంచి రెండు వరకు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో రెవిన్యూ డివిజన్లు.. మండలాల్లోనూ మార్పు లు ఖాయమని తెలుస్తోంది. ఈ నెల 18న జరిగే మంత్రివర్గ భేటీలో ఈ అంశం పైన చర్చించి అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అదే సమయంలో కమిటీ ఏర్పాటు పైనా రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక.. సికింద్రాబాద్ విషయంలో తన హయాం లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన చేయనున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్‌ పేరు సహేతుకంగా లేదని, అందుకే మార్చినట్లు సీఎం పేర్కొన్నారు. రాచకొండ పేరు రాచరిక పాలనకు గుర్తుగా ఉందని మార్చామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+