గవర్నర్ తో రేవంత్ భేటీ - మంత్రివర్గ విస్తరణ..!?

తెలంగాణలో రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్నాయి. పాలనా పరంగా సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల కాలం ముగియటంతో పూర్తిగా పాలన పైన ఫోకస్ చేసారు. ఈ నెలలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. కీలక అంశాల పైన ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

గవర్నర్ తో భేటీ
గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ రాజకీయంగా చర్చకు కారణమైంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ మంత్రివర్గ విస్తరణ..నామినేడెట్ ఎమ్మెల్సీ పదవుల పైన చర్చించారు. ఈ నెలలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఎనిమిది నెలలకు బడ్జెట్ ను ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టనుంది. ప్రభుత్వం ఇటీవల కొన్ని బిల్లులను రూపొందించింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. దీంతో..మంత్రివర్గ విస్తరణ పైన చర్చ మొదలైంది.

CM Revanth meets Governor Radha Krishnana discussions over Bills and Assembly sessions

కీలక అంశాలపై చర్చ
ఈ వారంలోనే మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీ చీఫ్ నియామకం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఉండవని సీఎం రేవంత్ స్పస్టం చేసారు. కాంగ్రెస్ బీ ఫారం పైన పోటీ చేసిన వారికే మంత్రిగా అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక..మంత్రివర్గ విస్తరణలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ విస్తరణ కూర్పు ఉంటుందని చెబుతున్నారు.

అసెంబ్లీకి ముందే
అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీ నూతన కార్యవర్గం ఖరారవుతుందని సమాచారం. ప్రస్తుతం మంత్రి వర్గంలో రేవంత్‌ సహా నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఈసారి అవకాశం దక్కవచ్చని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.హైదరాబాద్ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. గవర్నర్ తో రేవంత్ భేటీ వేళ మంత్రివర్గ విస్తరణ పైన ఆశావాహుల్లో చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+