Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి..!

తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచింది. త్వరలోనే రూ.500 గ్యాస్ సిలిండర్ అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదే విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కేస్లాపూర్ పర్యటన సందర్భంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని సీఎం చెప్పారు.

అయితే రేషన్ కార్డు ఉన్నవారిక ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని చెప్పారు. వీలైనంత త్వరలో రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.2500 పథకం కూడా త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. అయితే పథకాలన్నింటికి కూడా రేషన్ కార్డు మస్ట్ షుడ్ చేసే అవకాశం ఉంది.

CM Revanth Reddy announced that ration card holders will be given free electricity

అందుకే చాలా మంది రేషన్ కార్డు కోసం ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు మీసేవలో కూడా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారానేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరుకు ముందు ప్రస్తుతం ఉన్న అనర్హులను గుర్తించి తొలగించాలని యోచిస్తోంది. రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది.

కాగా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకునేందుకు ఫిబ్రవరి 29 తేదీ వరకు గడువు పొడగించారు. ఆలోగా రేషన్ కార్డు కేవైసీ పూర్తి చేసుంటే.. రేషన్ కార్డు ఉంటుంది లేకుంటే తొలగిస్తారు. మార్చిలో కొత్త రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+