రాజకీయ కక్షలు వదిలి మంచి సర్పంచ్‌లను ఎన్నుకోవాలి: సీఎం రేవంత్
ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, గత ఎన్నికల్లో ఈ జిల్లా సంపూర్ణంగా ఆశీర్వదించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడిందని కొత్తగూడెం సభలో సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ రోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం ఒక గొప్ప అవకాశంగా సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చి, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును యూనివర్సిటీకి పెట్టడం తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చినందుకు ఇచ్చిన గౌరవం అన్నారు. పదేళ్లు ప్రధానమంత్రిగా మన్మోహాన్ సింగ్ సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయారని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కేంద్రం
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసం వందలాది ఎకరాలను రైతులు ఇచ్చినా, ఉద్యోగాలు మాత్రం ఇతర ప్రాంతాల వారికి ఇవ్వడంతోనే తెలంగాణ ఉద్యమం పాల్వంచలోనే ప్రారంభమైందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ విధంగా తెలంగాణ ఉద్యమానికి స్పూర్తినిచ్చిన ప్రాంతం కొత్తగూడెం అని ఆయన అన్నారు. విద్య మాత్రమే తెలంగాణను ఉన్నతస్థానంలో నిలబెడుతుందని, అందుకే తమ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. దేశంలో ఆకలి కేకలను చూసి ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో తొలి ప్రధాని నెహ్రూ గొప్ప గొప్ప యూనివర్సిటీలను ప్రారంభించారు. అలాగే, నెహ్రూ దేశంలో ఆహార ఉత్పత్తులను పెంచడానికి బాక్రానంగల్ నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ వరకు అనేక ప్రాజెక్టులను కట్టించారని సీఎం గుర్తు చేశారు. సింగరేణి లాంటి సంస్థలను అభివృద్ధి చేయాలంటే ఎర్త్ యూనివర్సిటీ లాంటి విద్యా సంస్థలు అవసరం అని స్పష్టం చేశారు.

సాగునీటిపై నిర్లక్ష్యం, అభివృద్ధిపై హామీ
ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు గత పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పాలకులకు కమిషన్లు కురిపించాయి తప్ప, పొలాలకు నీళ్లు మాత్రం పారలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం కృష్ణ, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా పొలాలను పారించి సిరులు కురిపించాలని ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెలంగాణకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లా మంత్రులుగా ఉన్న భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు అనుకుంటే ఏమైనా జరుగుతుందని వారికి ఉన్న ప్రాధాన్యతను వెల్లడించారు. భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖమ్మం జిల్లా అభివృద్ది బాధ్యత తనదేనని, జిల్లా అభివృద్దికి నిధులు, అనుమతులు మంజూరు చేసే బాధ్యత కూడా నాదేనని గట్టి హామీ ఇచ్చారు.
మంచి పాలన, స్థానిక నాయకత్వం
తమ ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తూ మంచి పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రేషన్ కార్డుల పంపిణి, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరలు వంటి సంక్షేమ కార్యక్రమాలలో ఏ కార్యక్రమం ప్రారంభించినా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించామని తెలిపారు. మంచి పాలన ఉంటేనే ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు వంటి ప్రయోజనాలు ప్రజలకు అందుతాయని అన్నారు. అందుకే గ్రామాల్లో సర్పంచ్‌లు మంచోళ్లు ఉండాలి, మంత్రులతో కలిసి పనిచేసే వాళ్లు కావాలని ప్రజలకు సూచించారు. అభివృద్ధి కోసం మంచి సర్పంచ్‌లను ఎన్నుకోవాలని కోరుతూ, గ్రామాల్లో రాజకీయ కక్షలు మానండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. పదేళ్లపాటు అండగా నిలబడి తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలబెడదామని ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications