కేంద్రం షాక్ పై నోరు విప్పిన రేవంత్..! మిగిలింది వచ్చాక చెప్తా..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) యూకే, యూఎస్ టూర్ లకు ప్లాన్ చేసుకున్నాక.. వీటిలో యూకే టూర్ కు అనుమతిచ్చిన కేంద్రం.. యూఎస్ టూర్ కు మాత్రం అనుమతి నిరాకరించింది. దీంతో యూకే టూర్ నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్న రేవంత్ రెడ్డి.. ఈ వ్యవహారంపై నోరు విప్పారు. యూఎస్ టూర్ లో రేవంత్ రెడ్డి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు, అలాగే న్యూయార్క్ మేయర్ జొ్హ్రాన్ మమ్దానీతో భేటీ కావాలనుకున్నారని తెలిసి, కేంద్రం అడ్డుకుందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన తిరిగి వచ్చేందుకు సిద్దమవుతున్నారు.

అమెరికాలో ఆ ఇద్దరు వీవీఐపీలతో భేటీకి రేవంత్.. ! అందుకేనా కేంద్రం బ్రేక్ ?
అమెరికాలో ఆ ఇద్దరు వీవీఐపీలతో భేటీకి రేవంత్.. ! అందుకేనా కేంద్రం బ్రేక్ ?

అంతకు ముందే యూకే నుంచే రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. రేవంత్ టూర్ ను కేంద్రం అడ్డుకున్న తర్వాత అటు తెలంగాణ ప్రభుత్వం కానీ, కేంద్రం కానీ పూర్తి వివరాలు ఇవ్వలేదు. కేంద్రం రాజకీయ కారణాలతోనే రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కు అనుమతి ఇవ్వలేదని ఆ తర్వాత వెల్లడించింది. రేవంత్ రెడ్డి మాత్రం దీనిపై సైలంట్ గా ఉన్నారు. కానీ ఇవాళ మాత్రం దీనిపై ట్వీట్ చేశారు. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, తనకు బలమైన మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

cm revanth reddy breaks silence on centre s denial to US tour thanks to congress high command
రేవంత్ కు రెడ్ సిగ్నల్, ఆ బీజేపీ సీఎంకు గ్రీన్ సిగ్నల్..! కేంద్రం తీరుపై విమర్శలు?
రేవంత్ కు రెడ్ సిగ్నల్, ఆ బీజేపీ సీఎంకు గ్రీన్ సిగ్నల్..! కేంద్రం తీరుపై విమర్శలు?

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ విషయంలో తనకు అండగా నిలిచిన పార్టీకి, నాయకులకు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎంతో కృతజ్ఞుడను అంటూ రేవంత్ ట్వీట్ లో పేర్కొన్నారు. లండన్‌లో తన సమావేశాలు, నిర్ణీత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని; గత మూడు రోజులుగా తనకు లభించిన అద్భుతమైన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రేవంత్ తెలిపారు. రాజకీయ కారణాల రీత్యా తన అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించడంతో, అసలు ప్రణాళిక ప్రకారం బోస్టన్‌కు వెళ్లకుండా, కొన్ని గంటల్లోనే తిరిగి హైదరాబాద్‌కు విమానంలో బయలుదేరుతున్నానని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఈ అంశాలకు సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడతానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+